Site icon HashtagU Telugu

Iran Executions : ఇరాన్ దేశంలో మూడు నెలల్లో 100 మందికి ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?

0315303f F814 4224 Bf50 8e458f06e7cb

0315303f F814 4224 Bf50 8e458f06e7cb

సాధారణంగా తప్పులు చేస్తే అందుకు తగిన శిక్షలు వేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మరణ శిక్ష కూడా పడవచ్చు. ఇప్పటికి కొన్ని దేశాలలో అటువంటి శిక్షలు కూడా అమలులో ఉన్నాయి. అటువంటి దేశాల్లో ఇరాన్ దేశం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ ఇరాన్ దేశంలో ఈ ఏడాదిలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే దాదాపుగా 100 మందికి పైగా ఉరితీశారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకూ మూడు నెలల్లో 105 మందికి మరణ శిక్షలు అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది.

అయితే ఈ ఉరి శిక్షకు గురైన వారిలో మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. జెనీవాలోని యుఎన్ మానవ హక్కుల మండలి లో మానవహక్కుల డిప్యూటీ చీఫ్ నాడా ఆల్ నషీఫ్ ఇరాన్ పై తాజా నివేదికను విడుదల చేశారు. కాగా 2020 వ సంవత్సరంలో 260 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించగా, 2021లో 14 మంది మహిళలతో పాటలు మొత్తం 310 మంది వ్యక్తులకు మరణ శిక్ష విధించారట. 2022 లో కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ జనవరి ఒకటి నుంచి మార్చి 20 వ తేదీ మధ్య 105 మందికి మరణశిక్ష విధించారు.

ఇది మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలతో సహా తక్కువ నేరాలకు ఉరిశిక్ష పెరగడం పై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై 52 మందికి ఉరిశిక్ష కోసం షిరాజ్ జైలుకు తరలించినట్లు నషీఫ్ తెలిపారు. అదే విధంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ బాల నేరస్తులకు మరణశిక్షను కొనసాగించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేసింది. ఈ ఏడాది మైనర్ నేరాల కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు మన శిక్ష విధించారు. పెద్ద వారితో పోల్చుకుంటే ఎక్కువగా బాల నేరస్తులు మరణ శిక్షకు గురయ్యారు అని ఆమె తెలిపింది.