Shocking Facts : ఇవేం చట్టాలు రా బాబు…స్నానం చేయకుండా నిద్రపోతే చట్టవిరుద్ధమట..నవ్వకపోయినా ఫైన్ కట్టాల్సిందేనట..!!

కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చూస్తుంటే...చాలా విచిత్రంగానూ..ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. ఇవేం చట్టాలు అనిపిస్తుంది. నిద్రపోయే ముందు స్నానం చేస్తే...ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

  • Written By:
  • Updated On - June 14, 2022 / 08:38 PM IST

కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చూస్తుంటే…చాలా విచిత్రంగానూ..ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. ఇవేం చట్టాలు అనిపిస్తుంది. నిద్రపోయే ముందు స్నానం చేస్తే…ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ దేశంలో స్నానం చేయకుండా నిద్రపోతే అంతే సంగతులు. తీసుకెళ్లి జైల్లో పడేస్తారట. అది కూడా నేరమే. అంతేకాదు నవ్వకపోయినా..ముఖం మాడ్చుకుని కూర్చున్నా…ఫైన్ విధిస్తారట. ఇలాంటి పిచ్చి కాదు…క్రేజీ కండీషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవ్వన్నీ ఏదేశంలో అనుకుంటున్నారా…తెలుసుకుందాం.

1. ఇంగ్లాండ్ లోని మసాచుసెట్స్ నగరంలో ఓ వింత చట్టం అమలులో ఉంది. అక్కడ ఎవరైనా స్నానం చేయకుండా నిద్రపోయినట్లయితే అది చట్టవిరుద్ధం అవుతుంది. అంతేకాదు స్నానం చేయకుండా నిద్రపోతే…జైలు శిక్షకూడా విధిస్తారు.
2. పావురాలకు ఆహారం ఇస్తే శాన్ ఫ్రాన్సిస్కో, ఇటలీలో నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా పావురాలకు గింజలు వేసినట్లు కనిపిస్తే అరెస్టు ఖాయం.
3. జపాన్ లో ఊబకాయం క్షమించరాని నేరమట. 2008లో మెటాబోలాను జపాన్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
4. లోదుస్తులతో ఎవరైనా కారును క్లీన్ చేస్తే…అందుకు జరిమానా విధిస్తుందట శానిఫ్రాన్సిస్కో సర్కార్.
5. స్విట్జర్లాండ్ లో ఎవరైనా రాత్రి పది తర్వాత బాత్ రూంలో ఫ్లష్ చేసినా…బాత్ రూం నుంచి ఏవిధమైన సౌండ్ వచ్చినా జరిమానా పక్కా.
6. ఇక ఇటలీలోని మిలాన్ లో బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రతి పౌరుడు కూడా నవ్వుతూ కనిపించాలి. ముఖం మీద నవ్వు లేదో వంద డాలర్ల జరిమానా విధిస్తారట. రోజుకు వందల మంది జరిమానాల భారీన పడుతున్నారట.
7. హాంకాంగ్ లో భర్త తన భార్యను మోసం చేస్తే…భార్య చేతులతోపాటు భర్తను చంపడం అక్కడ చట్టబద్ధంగా పరిగణిస్తారట. తన చేతులతో భర్తను చంపడం ఇష్టపడకపోతే ఇతర మార్గాల్లో శిక్షణు అమలు చేస్తారట.
8. సింగపూర్ లో 1992 జనవరి 3 నుంచి చూయింగ్ గమ్ లను అమ్మడం తయారు చేయడం నిషేధం. నోటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డాక్టర్ సలహామేరకు చూయింగ్ గమ్ నమలవచ్చు.
9. ఏ దేశంలోనైనా రోడ్లపై వేగంగా డ్రైవింగ్ చేస్తే వారిని శిక్షిస్తుంది. కానీ జర్మనీలోని ఆటోబాన్ రోడ్ల మీద మీకు నచ్చినంత వేగంతో వెళ్లొచ్చు. కారులో సరిపడినంత ఆయిల్ ఉండాలి. రోడ్డుపై సడెన్ గా కారు ఆగితే మాత్రం జరిమాన కట్టాల్సిందే