Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెట్‌ రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి

Integrated Residential Schools

Integrated Residential Schools

Integrated Residential Schools : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం ప్రజా భవన్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. ఒక్కో స్కూల్ 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు నాడు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో పేద బడుగు బలహీన కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ దేశ చరిత్రలోనే అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉంటాయా? ఇలా కూడా కట్టొచ్చా? అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పొతున్నామన్నారు.

Read Also: BJP : వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తా : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆంగ్ల మద్యమం 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఓన్ బిల్డింగ్స్ లేవన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూల్ మోడల్ గా ఉండనున్నాయని వివరించారు.

ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు. దశల వారిగా వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 20 నుంచి 22 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించినున్నట్లు వివరించారు. ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లకు దసరాకు ముందే భూమి పూజ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని భట్టి వివరించారు. తెలంగాణలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని, 663 స్కూళ్లకు సొంత భవనాలు లేవని తెలిపారు. కాగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలకు ఈ ఏడాది రూ.5 వేల కోట్లు నిధులు ఖర్చు చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Read Also: Waiter Jobs : కెనడాలో వెయిటర్ జాబ్స్.. వేలాది మంది భారత విద్యార్థుల క్యూ