Site icon HashtagU Telugu

PM Modi: జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం..బాలాకోట్‌ దాడిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

PMAY-Urban 2.0

PMAY-Urban 2.0

Balakot Strikes: పాకిస్థాన్‌(Pakistan) ఆక్రమిత భూభాగంలోని బాలాకోట్‌(Balakot)లో భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృషించిన విషయం తెలిసిందే. గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ దాడుల పై ప్రధాని మోడీ(Pm Modi) తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కర్ణాటకలోని బగల్‌కోట్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ ఈ ఘటనను ప్రస్తావించారు. ‘ఇది నవ భారత్‌. మనకు హానీ తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో నక్కినా వేటాడి మరీ చంపేస్తాం. వెనుక నుంచి దాడి చేయడంపై మోడీకి నమ్మకం లేదు. శత్రువుతో ఎదురుగా నిలబడే పోరాడుతాం. 2019 నాటి బాలాకోట్‌ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం’ అని ప్రధాని తెలిపారు.

‘బాలాకోట్‌ వైమానిక దాడుల గురించి మీడియాను పిలిచి వెల్లడించాలని నేను మన బలగాలకు చెప్పా. అయితే, అంతకంటే ముందు పాకిస్థాన్‌కు ఈ విషయం చెప్తానన్నా. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్‌ చేస్తే వారు అందుబాటులోకి రాలేదు. అందుకుని.. బలగాలను మరికొద్ది సేపు వేచి ఉండమన్నా. పాక్‌కు దీని గురించి చెప్పిన తర్వాతే.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాం. మోడీ దేన్నీ దాచిపెట్టడు. ఏది చేసినా బహిరంగంగా చేస్తాడు’ అని నాటి సంఘటనలను ప్రధాని వివరించారు.

Read Also:Cash Is King : ‘యూపీఐ’ రెక్కలు తొడిగినా క్యాషే కింగ్ !

కాగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను జైషే ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్‌.. పాక్‌ సహా ప్రపంచదేశాలకు గట్టి సందేశమిచ్చింది.

Exit mobile version