House For 1 Rupee : కర్ణుడిని మించిపోయారు..అద్దెకు ఉండేవాళ్లకు రూపాయికే ఇంటిని ఇచ్చేశారు

House For 1 Rupee :  ఒక్కరోజు కూడా అద్దె కోసం ఆగని ఇంటి ఓనర్లను మనం చూస్తుంటాం..

  • Written By:
  • Updated On - August 8, 2023 / 12:51 PM IST

House For 1 Rupee :  ఒక్కరోజు కూడా అద్దె కోసం ఆగని ఇంటి ఓనర్లను మనం చూస్తుంటాం..

ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లను నిత్యం టార్చర్ చేసే ఇంటి ఓనర్లను మనం చూస్తుంటాం..

కానీ ఒక ఇంటి ఓనర్లు.. దానంలో కర్ణుడిని మించిపోయారు.. 

ఒకే ఒక్క రూపాయికి తమ ఇంటిని .. అద్దెకు ఉన్నవాళ్లకు అప్పగించేశారు..    

Also read :  Trump-Rape Charge-True : ట్రంప్ పై మహిళా జర్నలిస్ట్ రేప్ అభియోగం దాదాపు నిజమే : కోర్టు

అది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీ..  సిటీలోని వార్డ్ నంబర్ 47లో  దినేష్ గుప్తా ఫ్యామిలీకి 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉంది. 200 ఏళ్ళ కిందట దినేష్ గుప్తా పూర్వీకులు కట్టించిన ఇల్లు అది. దినేష్ గుప్తా సహా మొత్తం 11 మంది అన్నదమ్ములు ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. వివిధ వ్యాపారాల్లో బాగా సంపాదించిన  11 మంది సోదరులు ఇప్పుడు ఎవరికి వారుగా సొంత ఇళ్ళు కట్టుకొని జీవిస్తున్నారు. దీంతో తమ 300 చదరపు అడుగుల స్థలంలోని ఇంటిని నాలుగు ఫ్యామిలీలకు అద్దెకు ఇచ్చారు. అయితే ఈ నాలుగు కూడా అతినిరుపేద కుటుంబాలు. చాలా ఏళ్లుగా  గుప్తా బ్రదర్స్ కు అద్దె కూడా కట్టడం లేదు.  భారీ వర్షాలకు ఇంటిలోని ఒక భాగం కూలిపోయినా.. ఆ నాలుగు ఫ్యామిలీలు ఓనర్లకు కంప్లైంట్ చేయకుండా ఓపికగా నివసిస్తున్నాయి. అద్దె చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నా గుప్తా బ్రదర్స్ పెద్ద మనసుతో ఏమీ అనకపోవడంతో .. వాళ్లు చాలా ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్నారు.

Also read : National Cat Day 2023 : అంతర్జాతీయ పిల్లి దినోత్సవం..ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ఈనేపథ్యంలో ఇటీవల సమావేశమైన 11 మంది గుప్తా బ్రదర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 200 ఏళ్ళ కిందటి ఆ ఇంటిని అద్దెకు ఉంటున్న నాలుగు నిరుపేద కుటుంబాలకు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ఈవిషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు కూడా చెప్పారు.  గుప్తా బ్రదర్స్ పెద్ద మనసును (House For 1 Rupee) ఎమ్మెల్యే మెచ్చుకున్నారు. తాజాగా  స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో  కేవలం ఒక్క రూపాయికి  300 చదరపు అడుగుల స్థలంలోని ఇంటిని నాలుగు ఫ్యామిలీలకు లీజు కోసం గుప్తా బ్రదర్స్ బదిలీ చేశారు.  ఇప్పుడు ఇండోర్ సిటీలో గుప్తా బ్రదర్స్ దానశీలతపై చర్చ జరుగుతోంది.