Jio World Plaza : దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ ‘జియో వరల్డ్ ప్లాజా’ ఈరోజు ప్రారంభం కానుంది. దీన్ని రిలయన్స్ రిటైల్ సంస్థ ముంబైలోని బీకేసీలో ఏర్పాటుచేసింది. ఇక్కడ రిటైల్ ఫ్యాషన్ షాపింగ్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ అనుభవం కూడా పొందొచ్చు. ‘జియో వరల్డ్ ప్లాజా’.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌లకు కనెక్ట్ చేసి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్రాండ్‌లతో పాటు టాప్ ఇండియన్ బ్రాండ్స్‌కు నెలవుగా జియో వరల్డ్ ప్లాజా నిలువనుంది. ఇక్కడ దాదాపు 66 లగ్జరీ బ్రాండ్‌ల ఉత్పత్తులను విక్రయించనున్నారు. బాలెన్ సియాంగా (Balenciaga), జియార్జియో అర్మానీ కేఫ్ (Giorgio Armani Café), పాటరీ బార్న్ కిడ్స్ (Pottery Barn Kids), శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఈఎల్ అండ్ ఎన్ కేఫ్, రిమోవా ఉన్నాయి. వాలెంటినో, టోరీ బర్చ్, వైఎస్ఎల్, వెర్సేస్, టిఫనీ, లాడూరీ, పోటరీ బార్న్ స్టోర్లు ఈ ప్లాజాలో ఉంటాయి. వీటితో పాటు లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బెయిలీ, జార్జియో అర్మానీ, డియోర్, బల్గారి లాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, ఫల్గుణి & షేన్ పీకాక్, రీతూ కుమార్‌ల డిజైనర్ దుస్తులు కూడా జియో వరల్డ్ ప్లాజాలో అందుబాటులో ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్లాజా నిర్మాణం విశేషాలు..
- ‘జియో వరల్డ్ ప్లాజా’లో రిటైల్ దుకాణాలు, విశ్రాంతి రూంలు, ఫుడ్ కోసం ప్రత్యేక సెంటర్ ఉన్నాయి.
- దాదాపు 7,50,000 చదరపు అడుగులు, నాలుగు అంతస్తులలో ఈ ప్లాజాను నిర్మించారు.
- ప్లాజా నిర్మాణం తామర పువ్వులా ఉంటుంది.
- దీన్ని రిలయన్స్ బృందం, అమెరికా ప్రధాన కార్యాలయ ఆర్కిటెక్చర్ కంపెనీ టీవీఎస్ సంయుక్తంగా నిర్మించాయి.
- ప్లాజా ఫ్లోర్ మొత్తం పాలరాయితో తయారు చేశారు.
- ఎత్తైన గోపురం పైకప్పులు, అద్భుతమైన లైటింగ్ విలాసవంతమైన అనుభవాన్ని కల్పిస్తుంది.
- కస్టమర్లకు టాక్సీ ఆన్ కాల్, వీల్ చైర్ సర్వీస్, హ్యాండ్స్ ఫ్రీ షాపింగ్, బట్లర్ సర్వీస్, బేబీ స్త్రోలర్ వంటి సౌకర్యాలను అందిస్తున్నారు.