Charge Man Jobs : ఛార్జ్‌మ్యాన్ అయ్యే ఛాన్స్.. 372 జాబ్స్

ఇండియన్ నేవీలో జాబ్ చేసే గొప్ప ఛాన్స్. నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టుల(Charge Man Jobs) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

Published By: HashtagU Telugu Desk
Charge Man Jobs

Charge Man Jobs

ఇండియన్ నేవీలో జాబ్ చేసే గొప్ప ఛాన్స్. నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టుల(Charge Man Jobs) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లతో సహా నేవీ నౌకల్లోని వివిధ సిస్టమ్‌లు, పరికరాల నిర్వహణతో పాటు మరమ్మత్తును పర్యవేక్షించడమే ఛార్జ్‌మ్యాన్ డ్యూటీ. 18 నుంచి 25 ఏళ్లలోపు వారు ఈ జాబ్ కు అప్లై చేయొచ్చు. ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఆ విభాగాల్లో ఒక దానితో ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసినవారు ఛార్జ్‌మెన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 29లోగా ఆన్‌లైన్ లో అప్లికేషన్ సమర్పించాలి. అప్లికేషన్ స్క్రీనింగ్ , రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. మొత్తం 372 ఛార్జ్‌మెన్ పోస్టుల(Charge Man Jobs)లో ఎలక్ట్రికల్ గ్రూప్ లో 42, వెపన్ గ్రూప్ లో 59, ఇంజనీరింగ్ గ్రూప్ లో 141, నిర్మాణం అండ్ నిర్వహణ గ్రూప్ లో 118, ఉత్పత్తి ప్రణాళిక అండ్ నియంత్రణ గ్రూప్ లో 12 ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇండియన్ నేవీ ఛార్జ్‌మెన్ జీతం రూ.35400 నుంచి మొదలై రూ. 112400 దాకా పెరుగుతుంది.

also read : Jobs With Ms Excel : MS EXCEL వస్తే..ఎక్సలెంట్ జాబ్స్

దరఖాస్తు చేసుకోవడం ఇలా..

* అభ్యర్థులు joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* హోమ్‌ పేజీలో, జాయిన్ నేవీ.. ఆపై వేస్ టు జాయిన్‌పై క్లిక్ చేయండి.
* తర్వాత, సివిలియన్‌పై క్లిక్ చేసి.. ఆపై ఛార్జ్‌మ్యాన్-IIపై క్లిక్ చేయండి.
* దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
* అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
* దరఖాస్తు రుసుము చెల్లించండి.
* భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

  Last Updated: 16 May 2023, 12:33 PM IST