Site icon HashtagU Telugu

Navy Agniveer : ఇంటర్ పాసయ్యారా.. నేవీలో జాబ్ ఇదిగో

Agniveer Yojana Changes

Agniveer Yojana Changes

ఇంటర్ పాసయ్యారా ? 

అయితే ఈ జాబ్ మీకోసమే !!

ఇండియన్ నేవీ లో  అగ్నివీర్ (Navy Agniveer) జాబ్ మీకోసమే.. 

1,365 అగ్నివీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో 273 జాబ్స్ ను  మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఇంటర్ లో గణితం, భౌతికశాస్త్రంతో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లలో కనీసం ఒకదానితో ఉత్తీర్ణులై ఉండాలి. 2002 నవంబర్ 1 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. పూర్తి వివరాలకు అగ్నివీర్ వెబ్‌సైట్‌ https://agniveernavy.cdac.in/ చూడొచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 15. దీనికి సెలెక్ట్ అయ్యే వారికి నెలకు రూ. 30,000 ఇస్తారు. అభ్యర్థికి అవివాహితులై ఉండాలి. దరఖాస్తు ఫారమ్ కోసం పరీక్ష రుసుము రూ. 550. అగ్నివీర్ (Navy Agniveer) పోస్టుల ఎంపిక ప్రక్రియను రెండు దశలలో నిర్వహిస్తారు. ప్రాథమిక దశలో ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. రెండో దశలో రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఆన్‌లైన్ రాత పరీక్షలో ఒక్కో మార్కుతో 100 ప్రశ్నలు ఉంటాయి.

Also read : Agniveers: గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలలో అగ్నివీర్ లకు 15 శాతం రిజర్వేషన్..!

ఇలా దరఖాస్తు చేయాలి.. 

స్టెప్  1: అగ్నివీర్ వెబ్‌సైట్‌ https://agniveernavy.cdac.in/ కి లాగిన్ అవ్వండి.  

స్టెప్  2: హోమ్‌ పేజీలో అగ్నివీర్ (SSR) లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్  3: మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, మీ ఇతర ప్రాథమిక వివరాలను నమోదు చేయండి.

స్టెప్  4: రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన వివరాలను  నింపండి. మీ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

స్టెప్  5: అవసరమైన డాక్యుమెంట్స్  అప్‌లోడ్ చేయండి.

స్టెప్  6: దరఖాస్తు రుసుము చెల్లించండి. 

స్టెప్  7:  మీ ఫామ్ ను సబ్మిట్ చేసి.. డౌన్‌లోడ్ చేయండి.