Indian Fishermen Arrested : భార‌త జాల‌ర్ల‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ.. మైన‌ర్ స‌హా 15 మంది..?

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి తమ దేశ జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడుకు...

  • Written By:
  • Updated On - November 7, 2022 / 06:57 AM IST

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి తమ దేశ జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడుకు చెందిన జాల‌ర్ల‌ను శ్రీలంక నావిక‌ద‌ళం అరెస్ట్ చేసింది. ఈ జాల‌ర్ల‌లో ఓ మైన‌ర్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం, మత్స్యకారులకు చెందిన రెండు పడవలను కూడా నేవీ సిబ్బంది సీజ్ చేశారు. అరెస్టైన వారంతా తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన మత్స్యకారులుగా గుర్తించారు. రామేశ్వరం మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం దాదాపు 2,500 మంది చేపల వేటకు వెళ్లారని.. తలైమన్నార్ సమీపంలోని ధనుష్కోడి వద్ద చేపల వేట సాగిస్తుండగా శ్రీలంక నేవీ అక్కడికి చేరుకుని వారిని తరిమికొట్టిందని తెలిపారు. 15 మంది మత్స్యకారులను నావికాదళ నౌకలు చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు మత్స్యకారుల సంఘం నాయకులు తెలిపారు. రెండు మెకనైజ్డ్ బోట్లు కూడా శ్రీలంక నేవీ అదుపులో ఉన్నాయని తెలిపారు. మత్స్యకారులను తలైమన్నార్ నావికాదళ శిబిరానికి తరలించి, విచారణ అనంతరం శ్రీలంక మత్స్యశాఖకు అప్పగించనున్నారు. ఖరీదైన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లను జప్తు చేయడంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గుర‌వుతున్నామ‌ని మ‌త్య్స‌కారులు తెలిపారు.