Indian Air Force: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నడుమ భారత్ సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున గగనతల యుద్ధ విన్యాసం కోసం NOTAM (Notice to Airmen) జారీ చేసింది. భారత వైమానిక దళం (Indian Air Force) బుధవారం, గురువారం రోజుల్లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని ఎడారి ప్రాంతంలో, సమీప ప్రాంతాల్లో విన్యాసాలు నిర్వహించనుంది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30తో సహా అనేక యుద్ధ విమానాలు పాల్గొంటాయి. జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎల్‌ఓసీపై యుద్ధ విమానాలు ఎగురుతాయి
మే 7 అంటే బుధవారం నాడు ఈ విన్యాసం భారత్-పాక్ సరిహద్దు (ఎల్‌ఓసీ) సమీపంలో జరుగుతుంది. ఈ ఎక్సర్‌సైజ్‌లో రాఫెల్, మిరాజ్‌తో పాటు అనేక యుద్ధ విమానాలు పాల్గొంటాయి. అలాగే ఈ సమయంలో రాడార్ సిస్టమ్స్, ఇతర వ్యూహాత్మక పరికరాలను కూడా మోహరిస్తారు.
Also Read: Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
NOTAM అంటే ఏమిటి?
NOTAM అంటే నోటిస్ టు ఎయిర్ మిషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన నోటిస్జ. ఇది పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సంభావ్య ప్రమాదాల గురించి సమాచారం అందిస్తుంది. దీని వల్ల విన్యాస సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఈ నోటిస్‌ను నిర్వహించడం వెనుక ఉద్దేశం భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడం. ఈ నోటిస్‌ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా జారీ చేస్తారు. ఇది ఫ్లైట్ ప్లానింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. బుధవారం నాడే దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ (నాగరిక రక్షణ విన్యాసం) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని లక్ష్యం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే జాతీయ సన్నద్ధతను పరీక్షించడం.