Site icon HashtagU Telugu

Pak : భారత్ చంద్రుడిపై కాలుపమోపింది..మరి మనం..పాక్‌ చట్ట సభ్యుడి కీలక వ్యాఖ్యలు

India has set foot on the moon..and we are..key elements of a Pakistani lawmaker

India has set foot on the moon..and we are..key elements of a Pakistani lawmaker

Pakistan: భారత్‌(India) సాధిస్తున్న విజయాలు..పాకిస్థాన్‌(Pakistan) దయనీయ స్థితిని వివరిస్తూ.. ఆదేశ చట్టసభ సభుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత్‌ చంద్రుడి మీద కాలుమోపింది..మరి పాకిస్థాన్‌లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్‌ చట్ట సభ్యుడు, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం చంద్రుడి మీదకు వెళ్తోంది. మనకిక్కడ కరాచీ పరిస్థితి ఏంటంటే.. చాలామంది పిల్లలు తెరిచివున్న మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఇండియా చంద్రుడిపై ల్యాండ్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వెంటనే కరాచీలో ఓ పిల్లాడు నాలాలో పడి మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతీ మూడో రోజూ ఇలాంటి వార్తలు సర్వసాధారణంగా మారాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Ashu Reddy : అషుని ఆపేదెవ్వరు.. గ్లామర్ ట్రీట్ తో దుమ్ముదులిపేస్తున్న జూనియర్ సమంత..!

పాకిస్థాన్‌కు కరాచీ ‘రెవెన్యూ ఇంజిన్’ లాంటిదని, దేశంలో రెండు ఓడరేవులు ఉన్నాయని పేర్కొన్న కమల్.. పాకిస్థాన్, సెంట్రల్ ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌కు కరాచీ గేట్‌వే లాంటిదని తెలిపారు. ఇక్కడి నుంచి దాదాపు 68 శాతం ఆదాయాన్ని దేశం మొత్తానికి ఇస్తున్నట్టు వివరించారు. కానీ, 15 ఏళ్లుగా కరాచీకి పరిశుభ్రమైన నీటిని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నీరు కూడా చోరీకి గురవుతోందని, ట్యాంకర్ మాఫీయా దానిని దోచుకుని కరాచీ ప్రజలకు అమ్ముతోందని వివరించారు.

Read Also: Bookings: ఈ కారు క్రేజ్ మామూలుగా లేదుగా.. 60 నిమిషాల్లో 50,000 బుకింగ్‌లు..!

పాకిస్థాన్‌లో 26.6 మిలియన్ల మంది పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని తెలిపారు. ఇది 70 దేశాల్లోని జనాభా కంటే ఎక్కువని వాపోయారు. చదువుకోని పిల్లలు దేశ ఆర్థికాభివృద్ధి మొత్తాన్ని నాశనం చేస్తున్నారని కమల్ తెలిపారు.