Site icon HashtagU Telugu

58000 Crorepatis : 58వేల మంది కోటీశ్వరులయ్యారు.. ఎలా అంటే ?

58000 Crorepatis

58000 Crorepatis

58000 Crorepatis : గత మూడేళ్లలో మనదేశంలో కొత్తగా 57,951 మంది కోటీశ్వరులు పుట్టుకొచ్చారు.. కరోనా మహమ్మారి చుట్టుముట్టడానికి ముందు (2019-20 సంవత్సరం నాటికి) ఏడాదికి కోటికిపైగా సంపాదించేవారు 1.11 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2022-23 సంవత్సరం నాటికి 1.69 లక్షలు దాటింది.. అంటే గడిచిన 3 సంవత్సరాల వ్యవధిలో మన దేశంలో 57,951 మంది కోటీశ్వరులు ఉద్భవించారు.

Also read : Robo Taxi : రోబో ట్యాక్సీలు రయ్ రయ్.. వీడియో చూడండి

ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమాచారాన్ని విశ్లేషించగా ఈవివరాలు వెల్లడయ్యాయని  ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. స్టాక్ మార్కెట్ లో బూమ్ రావడం, స్టార్టప్ లు పెరగడం, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాల్లో వృద్ధి, ఒక్కరే ఒకటికి మించిన సంస్థలలో పని చేస్తుండటం వల్ల దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని (58000 Crorepatis) పరిశీలకులు అంటున్నారు. 2016-17 నాటికి మన దేశంలో కోటీశ్వరుల సంఖ్య 68,263 మాత్రమే. కేవలం గత ఆరేళ్లలో ఈ సంఖ్య  మూడింతలు కావడం విశేషం.

Also read : World Mosquito Day: దోమలపై యుద్ధానికి తొలి అడుగు సికింద్రాబాద్ నుంచే.. తెలుసా ?