Site icon HashtagU Telugu

Bihar : బీహార్‌లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్‌కు 9

INDIA bloc in Bihar seals seat-sharing deal, RJD gets 26 seats, Congress 9

INDIA bloc in Bihar seals seat-sharing deal, RJD gets 26 seats, Congress 9

INDIA Bloc Seat Sharing Bihar: బిహార్​లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)​తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్​సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్​ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు.

కథియార్‌, కిషన్‌ గంజ్‌, పట్నా సాహిబ్‌, ససారాం, భాగల్‌పూర్‌, వెస్ట్‌ చంపారన్‌, ముజఫర్‌పుర్‌, సమస్తిపుర్‌, మహరాజ్‌ గంజ్‌ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బెగుసరాయ్‌, ఖగారియా, అర్హ్‌, కరకట్‌, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన 26 చోట్ల ఆర్జేడీ తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలోని 40 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్‌ 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో విజయం సాధించగా- ఆర్జేడీ, లెఫ్ట్‌ పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయాయి.

Read Also: Thatikonda Rajaiah : కేసీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ..? మళ్లీ బిఆర్ఎస్ లోకా..?

2019లో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్‌జేపీ 6 చోట్ల గెలుపొందాయి. ఎన్​డీఏ తరఫున ఈ సారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) ఐదు చోట్ల, జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామీ మోర్చా, లోక్‌ సమత పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి.

Read Also: Chandrababu : ఐదు జిల్లాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన

మరోవైపు, లోక్‌సభ ఎన్నికలకు గాను మేనిఫెస్టోను ఏప్రిల్ 5న దిల్లీలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఏప్రిల్ 6వ తేదీన రాజస్థాన్ జైపుర్​లో మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ నేత సుఖ్​జీందర్ సింగ్ రణధావా గురువారం తెలిపారు. భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని చెప్పారు. కానీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల తేదీ మారినట్లు సమాచారం.