UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌ కూటమి హవా

  • Written By:
  • Publish Date - June 4, 2024 / 10:53 AM IST

Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీ కూటమి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఈసారి చతికిల పడేలా కనిపిస్తోంది.

ముఖ్యంగా దేశంలో అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి చాలా పోటీని ఇస్తుంది. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకు చెరో సగం స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Read Also:  AP Politics : కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

ప్రస్తతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం, 33 స్థానాల్లో ఎన్డీయే కూటమి, 35 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్‌లో ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లకు గానూ 62 సీట్లలో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందింది. అయితే, ఈ సారి మాత్రం పరిస్థితి కొత్త బీజేపీకి ప్రతికూలంగా కనిపిస్తోంది.