Income Tax Refund : ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఐటీ శాఖ ముఖ్యమైన సూచన చేసింది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రీఫండ్స్ క్లియర్ కావాలంటే.. అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ డిమాండ్లతో ముడిపడిన ఇంటిమేషన్‌కు సమాధానం చెప్పాలని కోరింది. కొంతమంది ట్యాక్స్ పేయర్స్ విషయంలో ఇప్పటికీ ట్యాక్స్ డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 245 (1) ప్రకారం పాత డిమాండ్లను ప్రస్తుత రిఫండ్లలో సర్దుబాటు చేసుకునే ఛాన్స్ ను ట్యాక్స్ పేయర్స్‌కు కల్పిస్తున్నట్లు తెలిపింది.
Also read : New Zealand Beat Bangladesh: బంగ్లాదేశ్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత విజయం సాధించిన న్యూజిలాండ్..!
పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ డిమాండ్లను అంగీకరించడమో లేక తిరస్కరించడమో, డిమాండ్ స్టేటస్ తెలియజేయడమో చేయాలని ఐటీ శాఖ కోరింది. ట్యాక్స్ డిమాండ్లను క్లీన్ చేయడం ద్వారా రీఫండ్లను త్వరగా పొందొచ్చని పేర్కొంది. వీటికి సంబంధించి తాము చేసిన ఇంటిమేషన్లకు ప్రతిస్పందించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ట్యాక్స్ పేయర్స్ కు సూచించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి గానూ 7.09 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలవగా.. ఇప్పటివరకు 6.96 కోట్ల రిటర్నుల వెరిఫికేషన్ ను పూర్తి చేసి, 2.75 కోట్ల మందికి రీఫండ్ కూడా చేశామని ఐటీ శాఖ (Income Tax Refund) స్పష్టం చేసింది.