Brothel Bhoom @ SriLanka: శ్రీలంకలో బ్రోతల్ భూం.. సెక్స్ వర్కర్లుగా మారుతున్న మహిళలు

శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 01:16 PM IST

శ్రీలంక భారీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం మూడు పుటల తినడానికి కూడా అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది.టెక్స్ టైల్ ఇండస్ట్రీ భారీ గా నష్టపోవడంతో ఆ రంగంలో పనిచేసే మహిళలంతా అర్ధాకలితో అలమటిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేక వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మసాజ్ సెంటర్లలో ప్రత్యేకంగా గదులు ఏర్పాటుచేసిన తమ శరీరాలను అమ్ముకుంటున్నారు. విటులను ఆకర్షించేందుకు స్పా సెంటర్లలోనే  బెడ్లు ఏర్పాటుచేసి వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

“దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా మేం మా ఉద్యోగాలను కోల్పోవచ్చింది. మాకు ఏ పని దొరక్కపోవడంతో సెక్స్ వర్కర్లుగా మారాం. మా నెలవారీ జీతం దాదాపు రూ. 28,000, ఓటీలతో సహ 35,000 వరకు సంపాదిస్తాం. టెక్స్ టైల్ రంగం పడిపోవడంతో సెక్స్ వర్క్‌లోకి దిగాం. రూ. రోజుకు 15,000 సంపాదిస్తున్నాం. కానీ ఇది నిజం” అని ఓ సెక్స్ వర్కర్ మీడియాతో చెప్పింది.  SUML ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషీలా దండేనియా మాట్లాడుతూ.. “తమ పిల్లలు, తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు కూడా వ్యభిచారం చేస్తున్న మహిళలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.” శ్రీలంకలో డబ్బును అందించే అతి కొద్ది వృత్తులలో సెక్స్ వర్క్ ఒకటి” ఆమె అన్నారు. సెక్స్ ట్రేడ్ వైపు మళ్లడానికి ప్రధాన కారణం అధిక ద్రవ్యోల్బణం. ఇది వస్త్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ఆహారం, ఔషధాల కొరతతో స్త్రీలను వ్యభిచారాన్ని ఆశ్రయించేలా చేసిందని అక్కడి మహిళలు చెబుతున్నారు.