Site icon HashtagU Telugu

Alien Signal To Earth : భూమికి ఏలియన్స్ మెసేజ్.. ఏముందంటే ?

Alien Signal To Earth

Alien Signal To Earth

ఏలియన్స్ .. ఈ టాపిక్ అందరికీ ఇంట్రెస్టింగ్ !!

అవి ఉన్నాయా .. లేవా.. అనే సంగతి అలా ఉంచితే తాజాగా జరిగిన ఒక ఘటనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ డిబేట్ జరుగుతోంది. 

అదేమిటంటే.. అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సిగ్నల్(Alien Signal To Earth) వచ్చింది. 

మే 24న రాత్రి 9 గంటలకు అంగారకుడి కక్ష్యలో కదులుతున్న ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌(టీజీఓ) అనే స్పేస్ క్రాఫ్ట్..  ఎర్త్‌ స్టేషన్‌కు సిగ్నల్ రూపంలో ఒక మెసేజ్ పంపింది. ఇది టీజీఓ స్పేస్ క్రాఫ్ట్ నుంచి భూమికి చేరడానికి  16 నిమిషాల టైం పట్టింది.ఇలా ఇతర గ్రహాల నుంచి ఎన్‌కోడెడ్‌ మెసేజ్ సిగ్నల్ (Alien Signal To Earth) భూమికి రావడం ఇదే మొదటిసారి. ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌స్టిట్యూట్ (SETI) శాస్త్రవేత్త, ‘ఎ సైన్ ఇన్ స్పేస్’ ప్రాజెక్ట్ చీఫ్ డానియేలా ది పౌలిస్‌ తెలిపారు.  రానున్న రోజుల్లో గ్రహాంతర వాసుల మెసేజ్ లను క్షుణ్ణంగా స్టడీ చేసేందుకు ఇది ఒక ప్రాతిపదికగా నిలుస్తుందన్నారు. గ్రహాంతరవాసుల గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై వాళ్ళు సీక్రెట్ గా జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చేలా ఈ  ఘటన జరిగిందనే డిస్కషన్ నడుస్తోంది.

Also read : Aliens: అమెరికా కూల్చేసిన గుర్తుతెలియని వస్తువులు ఏలియన్స్ వా ?

ఏలియన్స్ మెసేజ్ ఇలా చూడండి..

ఏలియన్స్ పంపారని ప్రచారం జరుగుతున్న ఎన్‌కోడెడ్‌ మెసేజ్ .. శాస్త్రవేత్తలకు పెద్ద చిక్కుముడిగా మారింది. దాన్ని డీకోడ్‌ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్న అందరికీ ఛాన్స్ ఇచ్చారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా .. ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను https://asignin.space/the-message/ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే.. దాన్ని డీ కోడ్‌ చేసి, మీనింగ్ ఏమిటో  శాస్త్రవేత్తలకు పంపండి. ఏలియన్లు భూమిని సందర్శించినట్లు, ఇక్కడ దిగినట్లు చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు గతేడాది డిసెంబరులో వెల్లడించారు. యూఎఫ్‌వో సంబంధిత ఘటనలపై రూపొందిన వందలాది నివేదికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.