Site icon HashtagU Telugu

CLOUDED LEOPARD: కెమెరా కంటికి చిక్కిన అరుదైన జంతువు.. మీరు ఓ లుక్కేయండి..!

Cropped

Cropped

అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న CLOUDED LEOPARD ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫొటోను ఫారెస్ట్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్ల వావ్ అంటున్నారు. ఈ లీపార్డ్ మీద చారలు మేఘాలుల ఉంటాయి. భారత్‌, నేపాల్‌ హిమాలయ పర్వత ప్రాంతం, ఇండోనేసియాలో క్లౌడెడ్ లీపార్డ్‌లు ఉన్నాయి. ఈ క్లౌడెడ్ లీపార్డ్‌ల జీవన విధానం మిస్టరీగానే ఉంది.

అయితే ఈ చిరుతపులి ఫోటోలు నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను రహస్య కెమెరా ఉపయోగించి ఫోటోలు చిత్రీకరించారు. ఈ ఫోటోలు చిరుతపులి చీకట్లో సంచరించే సమయంలో తీశారు. ఈ జంతువు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. భారతదేశంలో కనిపించే అరుదైన పెద్ద పిల్లి జాతులలో ఇది ఒకటి. సోషమీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.

కొంతమంది నెటిజన్స్ దీనిని ‘అందమైన’ అని పిలుస్తుండగా, మరికొందరు ‘అరుదైన’ అని.. జాగ్వార్‌ని పోలి ఉంది.. కానీ రంగులో తేడా ఉంది అని తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు. ఈ జంతువులు ఇండోనేషియా, నేపాల్‌లోని హిమాలయాల దిగువన కనిపిస్తాయి. ఈ జంతువులు ప్రతి సంవత్సరం ఒకటి నుండి ఐదు పిల్లలకు జన్మనిస్తాయి. పిల్లలు మొదటి పది నెలలు మాత్రమే తల్లిపై ఆధారపడతాయి.