Site icon HashtagU Telugu

First Car Buying Tips : ఫస్ట్ టైం కారు కొంటున్నారా ? ఇవి బెస్ట్ ఆప్షన్స్

First Car Buying Tips

First Car Buying Tips

మీరు మొదటిసారి కారు కొనాలని (First Car Buying Tips ) ప్లాన్ చేస్తున్నారా ? ఏ కంపెనీ కారు కొనాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? ఎంతవరకు రేటు పెట్టొచ్చని ఆలోచిస్తున్నారా ? వీటిపై కొంత క్లారిటీ రావాలంటే మీరు కొన్ని బేసిక్ వర్షన్ కార్ల గురించి, వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి. రూ. 5.73 లక్షల ప్రైస్ రేంజ్ లో .. 30 కి.మీ మైలేజ్ ఇచ్చే కార్ల ఇన్ఫర్మేషన్ ను ఒకసారి చెక్ చేద్దాం.. 

చిన్నసైజు.. హ్యాచ్‌బ్యాక్.. 

కారును కొనాలనే డ్రీమ్(First Car Buying Tips ) చాలామందికి ఉంటుంది.  ఆ డ్రీమ్ ను నెరవేర్చుకునే క్రమంలో మీరు చేసే ప్లానింగ్ చాలా  ముఖ్యమైనది. లుక్స్, డిజైన్, ఫీచర్ల నుంచి బడ్జెట్ వరకు.. మీరు కారు కొనేటప్పుడు పరిగణించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా మన దేశంలో  చిన్నసైజు కార్లు, హ్యాచ్‌బ్యాక్ కార్లకు బాగా క్రేజ్ ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ అంటే కారు వెనుక భాగంలో డోర్ ఉండటం. చాలామంది తమ మొదటి కారుగా.. హ్యాచ్‌బ్యాక్ టైప్ కార్లను కొనేందుకే ఇష్టపడతారు. అయితే మీ బడ్జెట్ ఎంత అనే దాని ప్రకారం కారును సెలెక్ట్ చేసుకోవాలి.  తక్కువ ధర, చిన్న సైజు ఉండే కారు కొనేందుకే ప్రయార్టీ ఇవ్వండి. చిన్న కారు మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మీరు కంఫర్ట్ గా డ్రైవింగ్ చేసేందుకు చిన్న కార్లు బాగుంటాయి. పార్కింగ్ ప్రాబ్లమ్ కూడా పెద్దగా ఉండదు.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కారు.. బెస్ట్ 

మీరు మొదటిసారి  కారును కొంటున్నట్లు అయితే.. మ్యానువల్ కారు కాకుండా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన కారును కొనొచ్చు. ఇది డ్రైవ్ చేయడానికి కొంచెం సులువుగా ఉంటుంది. మీ మొదటి కారు ధర బడ్జెట్‌లో ఉండాలి.  తద్వారా ప్రతి నెల మీ మీద ఎక్కువగా EMI భారం ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్, మినీ, కాంపాక్ట్,  SUV వంటి ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. వాటి నుంచి మీ టేస్ట్ కు తగిన కారును ఎంచుకోవచ్చు. బడ్జెట్, మైలేజ్, సైజు ఆధారంగా అటువంటి కొన్ని కార్ల లిస్ట్ ను మేం ఇస్తున్నాం.. ఒకసారి  చూడండి..

1) హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: రూ. 5.73 లక్షలు

2) మారుతి సుజుకీ స్విఫ్ట్: రూ. 5.99 లక్షలు

3) టాటా టియాగో: రూ. 5.60 లక్షలు

4) టాటా పంచ్: రూ. 6 లక్షలు

5) రెనాల్ట్ కిగర్: రూ.6.50 లక్షలు