Bandi Sanjay: కరీంనగర్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..మరి పొన్నం సిద్ధమేనా..?

Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్‌( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? అని తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ […]

Published By: HashtagU Telugu Desk
If He Loses In Karimnagar,

If He Loses In Karimnagar,

Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్‌( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? అని తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

పొన్నం ప్రభాకర్‌కైనా, తనకైనా అమ్మ అమ్మేనని… అలాంటి అమ్మను అనేంత సంస్కారహీనుడిని తాను కాదన్నారు. తమకు బీజేపీ సంస్కారం నేర్పిందన్నారు. కానీ పొన్నం ప్రభాకర్ తల్లి పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. పొన్నం తీరుతో ఆయన తల్లి కూడా బాధపడుతుందని అన్నారు. ఆయన తండ్రి ఆత్మ కూడా బాధపడుతుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తాను గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పొన్నం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శ్రీరాముడిని ఎవరైనా అంటే కచ్చితంగా తాము కౌంటర్ ఇస్తామని స్పష్టం చేశారు.

read also : Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్

  Last Updated: 27 Feb 2024, 04:48 PM IST