2024 Job Calendar : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2024వ సంవత్సరంలో నిర్వహించనున్న క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. రీజనల్ రూరల్ బ్యాంకులకు సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పరీక్షల తేదీలను సైతం వెల్లడించింది. రీజనల్ రూరల్ బ్యాంకులలోని ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ప్రిలిమినరీ పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీలలో నిర్వహిస్తారు. సింగిల్ ఎగ్జామ్ తేదీ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 6న(2024 Job Calendar) జరుగుతుంది.
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 24, 25, 31 తేదీల్లో జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 13న జరుగుతుంది.
- ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 19న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 20న ఉంటుంది.
- స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ 9న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 14 జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఆసక్తిగల అభ్యర్థులు https://ibps.in/ అనే ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఐబీపీఎస్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి ఫొటో 20kb నుంచి 50kb సైజ్‌లో jpeg ఫార్మాట్‌లో ఉండాలి. అభ్యర్థి సంతకం 10kb నుంచి 20kb సైజ్‌లో jpeg ఫార్మాట్‌లో ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ అభ్యర్థి బొటనవేలు ముద్ర 20kb నుంచి 50kb సైజ్‌లో jpeg ఫార్మాట్‌లో ఉండాలి. అభ్యర్థులు చేతితో డిక్లరేషన్ రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇది 50kb నుంచి 100kb సైజ్‌లో jpeg ఫార్మాట్‌లో ఉండాలి.
Also Read: 50 Years – Single Charge : ఫోన్లలో న్యూక్లియర్ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 50 ఏళ్లు లైఫ్
ఇజ్రాయెల్ యుద్దం వల్ల పాలస్తీనా ఉద్యోగులను తొలగించింది. వారి స్థానంలో భారత ఉద్యోగులను నియమించుకోనుంది.అందులో భాగంగా 15 మందితో కూడిన బృందం జనవరి 15న ఇండియాకు వచ్చింది. జనవరి 16న హర్యానాలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించిన ఇజ్రాయెల్ టీమ్.. 20వ తేదీ వరకూ బార్ బెండర్, మేస్త్రీ, టైర్, కార్పెంటర్.. తదితర ఉద్యోగాల కోసం పది వేల మందికిపైగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతంతోపాటు, నెలకు రూ.16,515 బోనస్ కూడా ఉండనుంది. ఎంపికైన వారికి దీనితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది. అంతే కాకుండా యూపీలోనూ నియామక ప్రక్రియ జరగనుంది. ఆన్‌లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవాలి. తదుపరి రౌండ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను జనవరి 23 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడతారు.