Site icon HashtagU Telugu

RI Challenge: ‘నాకు లంచం వద్దు’.. ఆర్ఐ సంచలనం!

Ri

Ri

ప్రభుత్వ కార్యాలయాల్లో తరచుగా వినిపించే మాట లంచం. చేతులు తడపనిదే.. ఏ పనికానీ, ఏ ఫైలుకానీ ముందుకు కదలని పరిస్థితులు. ఏసీబీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెడుతున్న లంచాలకు బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలో ‘లంచం ఇవ్వడం తప్పు, లంచం తీసుకోవడం తప్పు’ అని నినాదిస్తున్నాడు తెలంగాణ లోని ఓ ఆర్ఐ.

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం. పాలకీడు మండలం ఆర్ఐ చిలకరాజు నర్సయ్య ‘నాకు లంచం వద్దు ‘ అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ కాలంలో ఇలాంటి ఉద్యోగులు ఉంటారా? అని ప్రజలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.