Inspiring Doctor: వైద్యో నారాయణ హరీ : ఫ్రీ డెలివరీలు చేస్తూ.. బంగారు తల్లులను బతికిస్తూ!

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంతోష్ తన భార్య డెలివరీ, ఇతర వైద్య అవసరాల కోసం రూ. 1 లక్ష అప్పు తీసుకున్నాడు. డెలివరీకి ముందు, అతని స్నేహితుడు మెడికేర్ అందిస్తున్న ఉచిత డెలివరీ పథకం గురించి చెప్పాడు. సంతోష్ వెంటనే తన భార్యను మెడికేర్ లో చేర్పించాడు.

  • Written By:
  • Updated On - November 16, 2021 / 09:37 PM IST

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంతోష్ తన భార్య డెలివరీ, ఇతర వైద్య అవసరాల కోసం రూ. 1 లక్ష అప్పు తీసుకున్నాడు. డెలివరీకి ముందు, అతని స్నేహితుడు మెడికేర్ అందిస్తున్న ఉచిత డెలివరీ పథకం గురించి చెప్పాడు. సంతోష్ వెంటనే తన భార్యను మెడికేర్ లో చేర్పించాడు. మగబిడ్డ అయితే బిల్లు కట్టాల్సి ఉంటుంది. అదే ఆడపిల్ల అయితే వైద్య ఖర్చులన్నీ ఉచితమే. అనుకున్నట్టుగా సంతోష్ కు ఆడబిడ్డ జన్మించింది. పైసా ఖర్చు లేకుండా ఫ్రీ డెలివరీ చేయడంతో ఆసుపత్రి యజమాని డాక్టర్ గణేష్ రఖ్‌ను కౌగిలించుకొని, తన సంతోషం వ్యక్తం చేశాడు. గత తొమ్మిదేళ్లుగా డాక్టర్ గణేశ్ ఆడపిల్లల కోసం ఉచితంగా డెలివరీ చేస్తున్నాడు. అయితే ఆడపిల్ల పుడితే కొందరు తల్లిదండ్రులు తమలో తాము బాధపడుతున్నారు. ‘ఈసారి కూడా ఆడిపిల్లేనా’ అంటూ ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి సామాజిక సమస్యలకు చెక్ పట్టేందుకు వైద్యుడు గణేశ్ ఆడపిల్ల పుడితే వైద్యఖర్చుల నిమిత్తం పైసా కూడా తీసుకోవడం లేదు.

“నాకు చెల్లి లేదు. నేను ఇద్దరు తమ్ముళ్లతో పెరిగాను. కానీ షోలాపూర్‌లోని మా గ్రామంలో ఆడపిల్లల పట్ల వివక్ష చూపించేవాళ్లు. పుట్టినప్పుడే ఆడశిశువులను చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. అందుకే ఆడపిల్లలకు ఉచితంగా డెలివరీ అందిస్తున్నాం’’ అని అన్నారు గణేశ్. నేను రైల్వే స్టేషన్లలో కూలీ పనిలో మా నాన్నకు సహాయం చేయడం ప్రారంభించాను. నేను కష్టపడి చదివి ఉద్యోగ భద్రత, మంచి డబ్బు, ఉన్నత ఉద్యోగం చేయాలని కలలు కన్నాను. నేను 2001లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పని చేయడం ప్రారంభించాను’’ అని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు డాక్టర్‌ గణేష్‌.

పేదరికాన్ని ప్రత్యక్షంగా చూసిన గణేశ్ పేదల కోసం ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆడపిల్లల మరణాలు ఆపేందుకు డెలివరీ చేయడానికి ఇద్దరు గైనకాలజిస్ట్‌లను నియమించుకున్నాడు. ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు రెండు వేలమంది ఆడ పిల్లలు పుట్టారు. వాళ్లందరికీ ఉచితంగా వైద్య సేవలందించారు. ఆడపిల్ల పుడితే బేబీకిట్ కూడా అందిస్తున్నారు.