BJP MLA Raja Singh responded on Hydra :హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిచారు. హైడ్రానా.. హైడ్రామానా..ఓవైసీకి రేవంత్ భయపడ్డాడు అంటూ చురకలు అంటించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూల గొడతారో టైమ్ డేట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఫాతిమా కాలేజి ను కూల్చకుంటే హైడ్రా ఫెయిల్ అయినట్టేనని మండిపడ్డారు. హైడ్రా (HYDRA)నా హైడ్రామా నా అని చర్చ జరుగుతుందన్నారు. ఓవైసీ వార్నింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డారా అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఆ బిల్డింగ్ కూల్చితే సీఎం రేవంత్ రెడ్డి మీరు తెలంగాణ హీరో అవుతారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
అక్రమార్కుల పాలిట హైడ్రా ఉక్కుపాదం..
మరోవైపు ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఆక్రమణలతో అమీన్‌పూర్ పెద్ద చెరువు కుంచించుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగి.. ఎఫ్టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రహరీ గోడ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైసీపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిందిగా సమాచారం.
ఆయన కొన్నేళ్ల క్రితం 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ప్రహరీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ఇంకోపక్క.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కార్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ.. “కత్వా చెరువులో 20కి పైగా అనధికారిక విల్లాలను గుర్తించాం. ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నాం. మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూల్చేయిస్తాం. జరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులిచ్చి కూలుస్తాం” అని వెల్లడించారు.
Read Also: