Site icon HashtagU Telugu

KTR: హైడ్రా కూల్చివేతలు.. ఆశ్రయం కోల్పోయి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి: కేటీఆర్

HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

Ktr demands telangana government : హైడ్రా కూల్చివేతలతో ఎంతో మంది పేదలు నిరాశ్రయులు అయ్యారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పేదల పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే హైడ్రా కూల్చివేతల వల్ల ఆశ్రయం కోల్పోయి.. రోడ్డున పడిన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంచడానికి సిద్ధంగా 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా ఆ పేదలు ఏ ఆసరా లేక చెరువుల పక్కన, కాలువల పక్కన నివాసం ఉంటున్నారు. అక్కడ పరిశుభ్రత లేకపోవడంతో దోమలు కుట్టి అనారోగ్యం బారిన పడుతున్నా వాళ్లు వేరే చోటుకు వెళ్లలేని పరిస్థితిలో రేకుల షెడ్యూలో ఉంటున్నారని తెలిపారు. కానీ అలాంటి వారి రేకుల షెడ్డులు, గుడిసెల్ని కూడా హైడ్రా పేరుతో కూల్చివేడయం దారుణమన్నారు.

Read Also:Bandi Sanjay : పవన్ కళ్యాణ్ కు బండి సంజయ్ మద్దతు..

ఈ ప్రాంతంపై ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారికి నగరంపై నమ్మకం పోతుందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ హైదరాబాద్ ను ఆగం చేయాలని చూస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, హైడ్రా కూల్చివేతలతో నిరాశ్రయులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించి న్యాయం చేయాలన్నారు. పేదవాళ్లు తెలుసో తెలియక చిన్న షెడ్డు, గుడిసె కట్టుకుంటారు. చట్టప్రకారం వారికి నోటిసులు ఇచ్చి, నచ్చ జెప్పాలి. తప్పు జరిగిందని వారికి వివరించి ఇక్కడ ఖాళీ చేయించి వేరే చోట ఇల్లు ఇస్తామని తరలించాలని సూచించారు.

Read Also:Muda scam case : చట్టం, రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను..సత్యానిదే గెలుపు: సీఎం సిద్ధరామయ్య