White Foam Flood : వానొస్తే నురగొస్తోంది.. హైదరాబాద్ లోని ఆ కాలనీలో హడల్ !

White Foam Flood : వానొస్తే.. వరదొస్తది అని అందరికీ తెలుసు.. కానీ హైదరాబాద్ లోని ఆ ఏరియాకు మాత్రం వానొస్తే.. నురగొస్తది..  

Published By: HashtagU Telugu Desk
White Foam Flood

White Foam Flood

White Foam Flood : వానొస్తే.. వరదొస్తది అని అందరికీ తెలుసు.. 

కానీ హైదరాబాద్ లోని ఆ ఏరియాకు మాత్రం వానొస్తే.. నురగొస్తది..  

భారీ వర్షం కురిస్తే చాలు.. కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ పరిధిలోని ధరణి నగర్‎ రోడ్లను తెల్లటి నురగలు ముంచెత్తాయి. 

వాటిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

ఆ నురగలు ఒక మనిషి పట్టేంత హైటెలో ఉండటం చూసి జంకుతున్నారు.

Also read : Lagadapati Rajagopal : కరుడు గట్టిన సమైక్య వాది మళ్లీ రాజకీయాల్లోకి రీ ఏంటీ ఇవ్వబోతున్నారా..?

ఆల్విన్ కాలనీ ఉన్న ప్రాంతంలో పరికి చెరువు ఉంది. జీడిమెట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా నుంచి  రసాయన వ్యర్థాలు వచ్చి ఆ పరికి చెరువులో కలుస్తుంటాయి. దీంతో ఆ చెరువు నీరు కలుషితమైపోతోంది. వానలు పడినప్పుడు ఆ చెరువులోని  కెమికల్ వాటర్ ఇలా నురగల్లా మారి .. పరిసర ప్రాంతాల్లోకి పోటెత్తుతోంది. పరికి చెరువు నుంచి ట్యాంక్‎బండ్ కు వెళ్లే రూట్ లో నాలా పక్కనే ధరణి నగర్ కాలనీ ఉంది.  ఈ కెమికల్ నీరు భూగర్భ జలాల్లోకి ఇంకుతోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ వరద నురగలు చర్మాన్ని తాకినా, కంట్లో పడినా ఇబ్బంది కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అలర్జీలు, చర్మ వ్యాధులు అలుముుకునే రిస్క్ ఉంటుందని అంటున్నారు.

Also read : Sonia Gandhi Vs PM Modi : ప్రధానికి సోనియాగాంధీ ప్రశ్నాస్త్రాలు.. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పై నిలదీత

చెరువు నుంచి ఇలాంటి రసాయన నురగలు రాకుండా కట్టడి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగంపై ఉంటుంది. దీనిపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ నురుగ నీళ్లు ధరణి నగర్ నాలా ఫెన్సింగ్ తో పాటు దగ్గరలోని ఇళ్ల పైకప్పును ఆనుకొని గంటలపాటు అలాగే ఉండిపోతోందని స్థానికులు చెబుతున్నారు. పరికి చెరువులోని ఫ్యాక్టరీల రసాయన వ్యర్థాలు చేరకుండా ఆపాల్సిన అవసరం ఉంది. రసాయన వ్యర్థాలను ఫ్యాక్టరీలు వదిలే క్రమంలో వాటిని ఫిల్టర్ చేయాలనే నిబంధనలు ఉంటాయి. ఈ రూల్స్ ను కర్మాగారాలు పాటించడం లేదని (White Foam Flood)  తెలుస్తోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ ఫోకస్ చేస్తే ఇంకోసారి ధరణి నగర్ కాలనీవాసులకు ఇలాంటి సమస్య ఎదురుకాదు.

  Last Updated: 06 Sep 2023, 03:19 PM IST