CV Anand: ఇక పై హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం: సీవీ ఆనంద్‌

CV Anand : నేటి నుండి హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే.

Published By: HashtagU Telugu Desk
Hyderabad police bans dj sound system during religious procession

Hyderabad police bans dj sound system during religious procession

Hyderabad police bans dj sound system: హైదరాబాద్‌లో నేటి నుండి డీజే, క్రాకర్స్‌ ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు సీపీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ధ కాలుష్యాన్ని కారణంగానే డీజేలకు అనుమతులను సవరిస్తున్నట్టు సీపీ చెప్పారు. సీవీ ఆనంద్‌ మంగళవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చలు జరిపాము. ఈ క్రమంలోనే డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధించడం జరిగింది. నేటి నుండి హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబుల్స్‌ను నిర్దేశించాము.

Read Also: Japan : జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడ రాజీనామా

జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్‌కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదు. రాత్రి వేళలో 45 డెసిబుల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించరాదు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం ఉంటుంది. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ పరికరాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుంది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆసుపత్రులు, స్కూల్స్‌, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధింపు ఉంటుంది. అలాగే, బీఎన్‌ఎస్ చట్ట ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

Read Also: Tirumala Laddu Issue : సిట్ విచారణను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

 

 

  Last Updated: 01 Oct 2024, 03:12 PM IST