Site icon HashtagU Telugu

Watch Video: లవ్ యూ బ్రో.. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల దాహం తీరుస్తున్న హైదరాబాదీ!

Water

Water

అసలే ఎండాకాలం.. ఆపై ట్రాఫిక్ జాం.. ముందుకు వెళ్లలేం, వెనక్కు కదలేం చాలామంది వాహనదారులు ఎండాకాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారింది. ఓ ఐదు నిమిషాలు నడి రొడ్డుపై ఉండాలంటేనే ఎన్నో అవస్థలు పడుతాం. ఇక ట్రాఫిక్ కానిస్టేబుళ్ల విషయానికొస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటివాళ్ల బాధలను చూసి చలించిపోయాడు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి.

హైదరాబాద్ అంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భగభగమండే ఎండల్లో సైతం ట్రాఫిక్ పోలీసులు వీధుల్లో ఉన్నారు. అలాంటివాళం దాహం తీర్చాలని భావించాడు నిఖిల్. హైదరాబాద్ లోని పలు చోట్ల విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు చల్లని వాటర్ బాటిల్స్ అందించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు.

తన మోటర్‌బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు వాటర్ బాటిళ్లను అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ నాయక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను 5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ట్రాఫిక్ పోలీసు వద్దకు వెళ్లి, వాటర్ బాటిల్ అందించాడు ఓ యువకుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లవ్ యూ బ్రో అంటూ అభినందిస్తున్నారు.

 

Exit mobile version