Watch Video: ప్రాణం పోసిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో!

విధినిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ వ్యక్తి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. 

Published By: HashtagU Telugu Desk
Police

Police

విధినిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ వ్యక్తి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి పడిపోయిన ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలను కాపాడాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. మారేడ్‌పల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఖదీర్ జూలై 14న మధ్యాహ్నం తన సహోద్యోగులతో కలిసి పెట్రోలింగ్‌లో ఉన్నాడు. విద్యుత్ షాక్‌తో మైసమ్మ దేవాలయం వద్ద మకర రాకేష్ స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గుర్తించాడు.

అతని వద్దకు పరుగెత్తి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడుకున్నాడు కానిస్టేబుల్. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఖదీర్ కృషిని స్థానికులు, అతని కుటుంబ సభ్యులు కొనియాడుతున్నారు. సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటంతో పోలీస్ విభాగం కూడా ప్రత్యేకంగా ఖదీర్ ను అభినందిచింది. ప్రస్తుతం ఖదీర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Last Updated: 16 Jul 2022, 12:00 PM IST