Site icon HashtagU Telugu

Hyderabad : ఈ ప్రాంతాలలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు – అర్బన్ ల్యాబ్ నివేదిక

Hyd Het

Hyd Het

ఈఏడాది తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత (Heat Islands) నమోదు అవుతుంది..మరో రెండు రోజుల్లో 50 డిగ్రీలకు చేరిన ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృతువాత పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుండి నిన్నటివరకు దాదాపు 50 మంది చనిపోయారు. ఈ ఎండలకు భయపడి ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. తాజాగా నగర పరిధిలోని ఏడు ప్రాంతాల్లో మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఏడు ప్రాంతాలు అర్బన్ హీట్ ఐలాండ్స్ గా మారాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఈమేరకు హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

We’re now on WhatsApp. Click to Join.

మార్చి నెలలో నగర వ్యాప్తంగా 7 ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు అర్బన్ ల్యాబ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డి నగర్‌, మన్సూరాబాద్‌, పటాన్‌చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో నేలపై సుమారు 49 డిగ్రీల టెంపరేచర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. ఈ ఏడు ప్రాంతాలను అర్బన్ హీట్ ఐలాండ్స్ గా పేర్కొన్నారు. ముందుముందు ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేసింది. చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారిపోయిందని..అందుకే ఇలా భూమిలో నుండి అత్యధిక ఉష్ణోగ్రత బయటకు వస్తుందని తెలిపింది. చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తేగానీ ఈ పరిస్థితిని మార్చలేమని హెచ్చరించారు.

ఒక్క నగరంలోనే కాదు అనేక పట్టణాల్లో కూడా చెట్లను పెంచడం లేదు..ఇళ్లలో కూడా చెట్టు పెంచకుండా వాటి స్థానంలో ఓ చిన్న గదిని నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే రూమ్ లలో ఏసి, కూలర్లు పెట్టుకొని చల్లదనం కొని తెచ్చుకుంటున్నారు. అదే ఇంట్లో వేప చెట్టో..మామిడి చెట్టో ఉంటె ఎంత చల్లగా ఉండేది..దానిని మరచిపోయి చాలామంది ఇలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా కనీసం ఇంట్లో ఎక్కడో చోట ఓ చెట్టు నాటాలని కోరుతున్నాం.

Read Also : Nani : జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు నేచురల్‌ స్టార్‌ నాని మద్దతు