Site icon HashtagU Telugu

Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

Huge encounter.. 10 Maoists killed

Huge encounter.. 10 Maoists killed

Encounter in Chhattisgarh : ఛత్తీస్‌గడ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 10మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మృతి చెందిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా అనేక ఆయుధాలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

కాగా, బస్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ పి.సుందర్‌రాజ్ శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, మృతుల సంఖ్య, స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. ఇంకా అక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయ‌ని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

ఇక, ఒరిస్సా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశించినట్లు నిన్న సమాచారం అందడంతో భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. దీంతో భద్రతా బలగాలను చూసి నక్సల్స్‌ వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Health Tips : తరచుగా ఆకలి , అలసట ఈ సమస్య యొక్క లక్షణాలు