Chandrayaan-3 Live : చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” బుధవారం (ఆగస్టు 23న) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్ -3 మిషన్ లోని ఈ దశను సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. గతంలో చంద్రయాన్-2 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ దశలోనే ఫెయిల్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవానికి ఇటీవల రష్యా పంపిన “లూనా-25” ల్యాండర్ ఆదివారం ఉదయం సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమై కూలిపోయింది. కానీ భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” ఈసారి సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి దాదాపు 120 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
Also read : Rusty Car – 15 Crore : తుక్కు కారును రూ.15 కోట్లకు కొన్నాడు.. ఎందుకు ?
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ను లైవ్ టెలికాస్ట్ లో చూసేందుకు (Chandrayaan-3 Live) యావత్ దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. ఇస్రో అధికారిక వెబ్ సైట్ లేదా ఇస్రో యూట్యూబ్ ఛానల్ లేదా ఇస్రో ఫేస్‌బుక్ పేజీలో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను లైవ్‌లో చూడొచ్చు, ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటల నుంచే డీడీ నేషనల్ టీవీలో లైవ్ ను కూడా తిలకించవచ్చని ఇస్రో ట్వీట్ చేసి వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించే విధంగా ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు చేయాలని దేశంలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను ఇస్రో కోరింది. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ చిరస్థాయిగా నిలిచేఘట్టం ఆసక్తి రేపటంతో పాటు యువత మనసులో అన్వేషణ పట్ల మక్కువ పెంచుతుందని ఇస్రో పేర్కొంది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో సాధించిన ఘనతను సమష్టిగా వేడుక చేసుకునేందుకు అవసరమైన ఖ్యాతిని, సమగ్రతను సృష్టిస్తుందని తెలిపింది. ఈ విజయం శాస్త్రీయ నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ విజయం శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, పరిశ్రమ, అంతరిక్ష పరిశోధనలో… భారత్ పురోగతికి ప్రతీకగా నిలవనుందని ఇస్రో పేర్కొంది.