Health Insurance : ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా మార్చుకోవాలి?

సాధారణంగా మనం వాడే సిమ్ నెట్ వర్క్ స్లోగా ఉంటే అలాంటప్పుడు వేరే నెట్ వర్క్ లకు పోర్ట్ అవుతూ ఉంటారు. మరి

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 07:00 AM IST

సాధారణంగా మనం వాడే సిమ్ నెట్ వర్క్ స్లోగా ఉంటే అలాంటప్పుడు వేరే నెట్ వర్క్ లకు పోర్ట్ అవుతూ ఉంటారు. మరి అదే మొబైల్ నెంబర్ పై వేరే నెట్ వర్క్ కి సంబంధించిన సిమ్ కొనుగోలు చేస్తూ ఉంటారు.  అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చట. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా!మీరు విన్నది నిజమే.. అయితే ఈ సదుపాయం వచ్చి ఇప్పటికే ఎన్నో ఏళ్ళు కూడా అయింది.

కానీ ఇలా పోర్ట్ పెట్టుకోవచ్చు అన్న విషయం పై చాలామందికి సరైన అవగాహన లేకపోవడంతో చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ యొక్క సేవలు నచ్చకపోయినా, క్లెయిమ్ సేవల పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు,అలాగే కొనసాగకుండా అదే ప్లాన్ పై వేరే కంపెనీకి మారిపోవచ్చట. ఇందువల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే అప్పటికే తీసుకున్న ప్లాన్ లో కొన్ని రకాల కవరేజీలకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి అయితే పోర్టింగ్ తో ఈ సదుపాయాలను కూడా కొత్త సంస్థలకు బదిలాయించుకోవచ్చట. ఒకవేళ పాత సంస్థను వదిలిపెట్టి వేరే సంస్థలో ప్లాన్ తీసుకుంటే అప్పుడు ఈ ప్రయోజనాలు రావు.

అదేవిధంగా ప్రీమియం కూడా వయసు పెరగడం వల్ల అధికం కావచ్చు. ఈ పోర్టింగ్ విషయానికి వస్తే.. హెల్త్ ప్లాన్ తో పాటుగా నో క్లెయిమ్ బోనస్ లను కూడా కొత్త కంపెనీకి మార్చుకోవచ్చట. పాత సంస్థలో పాలసీదారు నిర్ణితకాలం పాటు వేచి ఉండడం వల్ల ముందు నుంచి ఉన్న వ్యాధులకు వచ్చిన కవరేజీ ప్రయోజనాలను కొత్త సంస్థ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే అది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా రెన్యువల్ సమయంలో మాత్రమే పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్పటివరకు పాలసీదారులకు లభించిన బీమా రక్షణ కవరేజీకి తగ్గకుండా కొత్త సంస్థ కవరేజ్ ని ఆఫర్ చేయాల్సి ఉంటుందట. రెన్యువల్ అన్నది ప్రతి సంవత్సరం చేసుకోవాలి అన్న విషయం తెలిసిందే. రెన్యువల్ చేసుకోవడానికి 45 రోజులు ముందు వారి పాలసీని ఏ కంపెనీకి అయితే పోర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంపెనీ పేరుని రాస్తూ ఆ సంస్థకు పోర్ట్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ ప్రక్రియను రెన్యువల్ కు ఇంకా 45 నుంచి 60 రోజులు ముందు సమయం ఉంది అనగానే దీన్ని పూర్తి చేసుకోవాలి. అయితే ఆ ప్రపోజల్ కీ కొత్త సంస్థ ఆమోదించినప్పుడు ప్రీమియం కొత్త సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.