Site icon HashtagU Telugu

Sudan War – Pepsi Cola : పెప్సీ, కోలాలపై సూడాన్ యుద్ధం ఎఫెక్ట్

Sudan War Pepsi Cola

Sudan War Pepsi Cola

పెప్సీ, కోక కోలా అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. 

ఈ సమ్మర్ సీజన్ లో వీటి సేల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.. 

రుచికి, టేస్ట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ కూల్ డ్రింక్స్ కు.. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఓ మూలకు ఉన్న సూడాన్ దేశానికి ఒక లింక్ ఉంది తెలుసా ?

సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధం(Sudan War – Pepsi Cola) కూడా ఇప్పుడు పెప్సీ, కోక కోలా ఉత్పత్తి ప్రక్రియకు పెద్ద ఆటంకం కలిగిస్తోందని మీకు తెలుసా ?

కూల్ డ్రింక్స్ కు తుమ్మ జాతికి చెందిన “అకాసియా” చెట్లకు ఒక ముఖ్యమైన సంబంధం ఉంది. సూడాన్ లో ఈ ట్రీస్ బాగా పెరుగుతాయి. ఆ దేశంలో “అకాసియా” చెట్ల తోటలు విస్తృతంగా ఉంటాయి. వాటి నుంచి రెండు రకాల జిగురు లభిస్తుంది. ఒక రకం జిగురును  “అకాసియా  సెనెగల్ గమ్” అని, ఇంకో రకం దాన్ని “అకాసియా సేయాల్ గమ్” అని పిలుస్తారు. ఈ రెండింటిని  కలిపి “గమ్ అరబిక్” అని కూడా అంటారు.  పెప్సీ, కోక కోలా వంటి కూల్ డ్రింక్స్ లో ఈ జిగురులను.. చాలా దశల ప్రాసెసింగ్ తో శుద్ధి చేసి అవసరమైన రీతిలోకి మార్చుకొని వాడుతుంటారు. ఇంతకీ ఎందుకు దీన్ని వినియోగిస్తారంటే.. కూల్ డ్రింక్స్ కు స్పెషల్  టేస్ట్, స్పెషల్ కలర్ ఫుల్  లుక్ ఇవ్వడానికి !!

6 నెలల్లో స్టాక్ క్లోజ్ 

పెప్సీ, కోక కోలా కంపెనీలకు అవసరమైన “గమ్ అరబిక్”లో అత్యధికంగా 70 శాతం సూడాన్ దేశం నుంచే సప్లై అవుతుంది !! ప్రత్యేకించి సూడాన్ లోని సలహా రీజియన్ లో “అకాసియా” చెట్ల తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సూడాన్  అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. దీనివల్ల  “గమ్ అరబిక్” సప్లై చాలా తగ్గిపోయింది. ఫలితంగా ఆ రెండు ఫేమస్ కూల్ డ్రింక్స్ ఉత్పత్తి డౌన్ అయ్యే అవకాశం ఉండనే వార్తలు వస్తున్నాయి. సూడాన్ అంతర్యుద్ధం(Sudan War – Pepsi Cola) ఇలాగే కొనసాగితే.. వచ్చే 6 నెలల్లో కూల్ డ్రింక్స్ కంపెనీల దగ్గరున్న ‘గమ్ అరబిక్’ స్టాక్ అయిపోవచ్చని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 1,20,000 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుంది.  ప్రత్యేకమైన మిఠాయిలు,  సౌందర్య ఉత్పత్తులలో కూడా “గమ్ అరబిక్” ను వినియోగిస్తుంటారు.