Defected MLAs Case : నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా ఎంత టైం ఇవ్వాలి, ఇంకా ఎన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
Read Also: Samsung Co-CEO: శాంసంగ్ కో-సీఈవో గుండెపోటుతో కన్నుమూత!
మరోవైపు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ టికెట్ మీద లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని టీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. ఇక, జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ..ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ప్రశ్నించారు. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని, ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యేవరకు కాలయాపన చేస్తారా అంటూ ధర్మాసనం ప్రతివాదులను ప్రశ్నించింది. బీఆర్‌ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏం నిర్ణయం తీసుకుంటారు. ఫిర్యాదులపై 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇవ్వలేదు. ధర్మాసనం జోక్యం చేసుకున్నాక నామమాత్రంగా నోటీసులిచ్చారు. మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13వ తేదీన స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. మేం చేసిన ఫిర్యాదుకు ఏడాది గడుస్తున్నా స్పీకర్ షెడ్యూల్ చేయలేదు. యధేచ్ఛగా ఫిరాయింపులు జరుగుతున్నా, ఫిర్యాదులు అందుకున్న స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి పిటిషన్ పై సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు.
Read Also: Rajasingh : వాళ్లతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్