Aadhaar Update: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?

Aadhaar Update: భారతదేశంలో నివసించే ప్రజలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్నది అత్యంత కీలకంగా మారింది. ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 08:00 PM IST

Aadhaar Update: భారతదేశంలో నివసించే ప్రజలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అన్నది అత్యంత కీలకంగా మారింది. ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఆధార్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అన్నది అవసరం అన్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డులో చాలామందికి కొన్ని వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉంటాయి. ఆధార్ కార్డులో పేరు లింగం, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇలా ఏదో ఒకటి తప్పుగా ఉన్న వాటిని సరిచేసుకోవచ్చు. ఆధార్ లో మొత్తం సమాచారాన్ని పూర్తి చేయడం అన్నది అవసరం. యూఐడీఏఐ కూడా ప్రజలను ఎప్పటికప్పుడు ఆధార్ ను అప్డేట్ చేయించుకోవాలని చెబుతూ ఉంటుంది.

అయితే ఆధార్ కార్డ్‌ లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, లింగం మొదలైన వాటిని ఆధార్ లో ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో భాగంగానే ఆధార్ కార్డులో పేరులో తప్పులు ఉన్న,వివాహం తర్వాత మహిళలు తమ ఇంటి పేరు మార్చుకోవాలి అనుకున్నావారికీ కేవలం రెండుసార్లు మాత్రమే పేరును మార్చుకోవడానికి అనుమతి ఉంటుంది. మూడోసారి మార్పు చేయడం కుదరదు. అలాగే ఆధార్ కార్డులో లింగం తప్పుగా ఉంటే యూఐడీఏఐ నిబంధనల ప్రకారం లింగాన్ని మార్చుకోవచ్చు. అయితే లింగం మార్చుకోవడానికి కేవలం ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంటుంది.

అలాగే ఆధార్ లో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఒక్కసారి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ఆధార్ లో ఈమెయిల్ ఐడి చిరునామా, ఫోటో,ఫింగర్ ప్రింట్,ఐ స్కాన్ అప్డేట్ చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. వీటిని మీరు ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. వీటిని అప్డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఇటువంటి పరిమితిని విధించబడలేదు.