Eye Conjunctivitis: కలకలం రేపుతున్న కండ్లకలక, రోగుల రద్దీతో ఆస్పత్రులు ఫుల్!

రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి వరకు రెండు వేలకు పైగా కండ్ల కలక కేసులు నమోదయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Eye

Eye

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కండ్లకలక కేసుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో రోగుల రద్దీ నెలకొంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు.  హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఉన్న సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కూడా కండ్లకలక రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ నజాఫీ బేగం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆస్పత్రిలో రోజూ 75-110 మంది కండ్లకలక వ్యాధిగ్రస్తులు వస్తున్నారని తెలిపారు.

కంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన ముందుజాగ్రత్త చర్యలను వివరిస్తూ, “ఎవరూ తువ్వాలు పంచుకోవద్దు. ముఖం లేదా కళ్లను తాకే ముందు, సబ్బుతో చేతులు కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి’’ అని సూచించారు. సాధారణంగా కండ్లకలక 7-10 రోజులలో నయమవుతుందని డాక్టర్ చెప్పారు. అయితే, తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే, రోగులు వైద్య సహాయం కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రులను సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ కంటికి హాని కలిగిస్తుందా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, “కార్నియాకు ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది.” అని చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో ఇప్పటికి వరకు రెండు వేలకు పైగా కండ్ల కలక కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ లోని ఓ హాస్టల్ లో 400 మంది కండ్ల కలక బారిన పడ్డారు. ఒకరి నుంచి ఒకరికి సోకడంతో రెండ్రోజుల్లో 400 కేసులు వచ్చాయని వైద్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అధికారికంగా వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. మొత్తంగా రెండు వేల వరకూ కేసులు ఉండొచ్చని తెలుస్తోంది. వారంలో 400 మంది కళ్ల సమస్యతో ఆసుపత్రి వచ్చారని సరోజిని దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

కండ్లకలక ఎలా వ్యాపిస్తుంది?

కంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తి గురించి ఆమె మాట్లాడుతూ, “కుటుంబంలో ఒకరికి కండ్లకలక సోకితే, అది మిగతా సభ్యులందరికీ వ్యాపిస్తుంది.ఇది  వేసవి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధి.

కండ్లకలక లక్షణాలు

కళ్ళు ఎర్రబడటం,

కళ్ళు నీరుకారడం,

దురద

అసౌకర్యం.

Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!

  Last Updated: 01 Aug 2023, 01:37 PM IST