Shocking: దారుణం.. శిశువు తలను కడుపులోనే వదిలేసిన డాక్టర్లు?

తాజాగా పాకిస్తాన్ లోని సింద్ ప్రావిన్స్ లో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 08:44 PM IST

తాజాగా పాకిస్తాన్ లోని సింద్ ప్రావిన్స్ లో ఒక బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యులు గర్భిణీకి శస్త్ర చికిత్స నిర్వహించి నవజాత శిశువు తలను వేరు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తార్పార్కర్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన భీల్ హిందూ మహిళ సమీప ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో అనుభవం లేని సిబ్బంది ఆమెకు చికిత్స చేసి ప్రాణాల మీదకు తెచ్చారని జామ్ షోరోలోని లియాఖత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ గైనకాలజీ విభాగం చీఫ్ ప్రొఫెసర్ డాక్టర్ రహీల్ సికిందర్ తెలిపారు.

తాజాగా ఆదివారం నిర్వహించిన శస్త్రచికిత్సలో ఆర్ హెచ్ సి సిబ్బంది తల్లి కడుపులో ఉన్న ఒక నవజాత శిశువు తల ను కత్తిరించి వదిలేశారు అని తెలిపారు. అయితే సిబ్బంది నిర్వాకం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళను సమీపంలో ఉన్న మితి ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో వెంటనే లియాకత్ వర్సిటీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారని, ఒక తల్లి గర్భంలో ఉండిపోయిన శిశువు భాగాన్ని బయటకు తీసి తల్లిని కాపాడాము అని తెలిపారు రహీల్.

పాప కళ్ళ లోపల చిక్కుకుపోయింది అని తల్లి గర్భాశయం చిద్రం అయ్యిందని శస్త్రచికిత్స చేసి ఆమె పొత్తికడుపులో తెరిచి తల బయటకు తీయాల్సి వచ్చింది అని డాక్టర్ సికిందర్ తెలిపారు. అంతేకాకుండా గైనకాలజీ వాటిలోని కొంత మంది సిబ్బంది ఆమెకు శస్త్రచికిత్స చేసినప్పుడు మొబైల్ ఫోన్ లో ఆమె ఫోటోలను తీసి వివిధ వాట్సాప్ గ్రూప్ లతో వాటిని షేర్ చేశారని జూమాన్ వివరించారు.