Site icon HashtagU Telugu

Honey Trap: గద్వాల్ లో హానీ ట్రాప్ కలకలం.. సోషల్ మీడియాలో మహిళల న్యూడ్ ఫొటోలు!

Honeytrap

Honeytrap

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది.  దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని రహస్యంగా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో దాదాపు 150 మంది మహిళల ఫొటోలు, వివరాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతమంది మహిళలను ఆకర్షించి, వారి నగ్న ఫోటోలు, వీడియోలను ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఆ మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఫోన్‌లో వారి బంధువు ఒకరి మహిళ ఫోటో కనిపించడంతో ముగ్గురి మధ్య వివాదాలు తలెత్తాయి.

ముగ్గురి మధ్య గొడవలు జరిగిన తర్వాత ఫోన్‌లలోని మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భయపడిన నిందితులు సమస్య నుండి బయటపడేయాలని సీనియర్ నేతలను అభ్యర్థించారు. కాగా, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని గద్వాల్ జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ కొట్టిపారేశారు. సమగ్ర విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతామన్నారు.