Site icon HashtagU Telugu

Underwater Kisses: అండర్ వాటర్ లో ముద్దులు.. రికార్డుకెక్కిన ప్రేమికులు!

Underwater Kiss

Underwater Kiss

ప్రేమికుల దినోత్సవం (Valentines Day) సందర్భంగా ఒక్కో జంట (Lovers) ఒక్కోవిధంగా సెలబ్రేట్ చేసుకోవడం కామన్. కానీ ఈ ఫొటోలో కనిపించే జంట ఇతర జంటకు భిన్నంగా సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియా (Social media)లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇన్ఫినిటీ పూల్‌లో 4 నిమిషాల 6 సెకన్ల పాటు అండర్ వాటర్ లో ముద్దులు పెట్టుకొని కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అండర్ వాటర్ (Underwater Kisses) కంటిన్యూగా ముద్దులు పెట్టుకొని ఆశ్చర్యపర్చారు. 13 ఏళ్ల క్రితం నెలకొల్పిన 3 నిమిషాల 24 సెకన్ల రికార్డును వీరు బద్దలు కొట్టారు. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

దక్షిణాఫ్రికా, కెనాడకు చెందిన బెత్ నీలే, మైల్స్ క్లౌటియర్ జంట వృత్తిరీత్యా డైవర్లు. ఏదైనా కొత్తగా చేయాలని అండర్ వాటర్ లో ముద్దుల ఫీట్ (Underwater Kisses) ను ప్రయత్నించారు. అయితే మొదట్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడంతో శ్వాస సమస్యను అధిగమించినట్టు చెప్పారు. వాలంటైన్స్ డే సందర్భంగా నాలుగు నిమిషాల పాటు ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటూ (Underwater Kisses) నీటి అడుగున ఉన్నారు. వారి ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొట్టాలంటే చాలా కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: First Look Poster: అర్జున్ రెడ్డికి మించి.. ఫస్ట్ లుక్ లోనే ఘాటైన ముద్దులు!