Viral News: పంట పొలాల్లో ప్రత్యక్షమైన తమన్నా, రాశీఖన్నా.. రైతు ఐడియా అదుర్స్!

కాలంతో పాటు ప్రతి ఒక్కరూ పాత పద్ధతులను వదిలి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Viral 1

Viral 1

కాలంతో పాటు ప్రతి ఒక్కరూ పాత పద్ధతులను వదిలి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇది వ్యవసాయానికి కూడా వర్తిస్తుంది. సాధారణంగా, రైతులు పొలాల మధ్యలో గడ్డితో నిండిన దిష్టిబొమ్మలను పక్షులు, జంతువులను భయపెట్టడానికి,  పంటలను రక్షించడానికి ఏర్పాటు చేస్తారు. అయితే అన్నమయ్య జిల్లాలోని రైతులు వింత ఆలోచన చేశారు. జిల్లాలోని మదనపల్లెలో టమాట ప్రధాన పంట.

తంబళ్లపల్లె మండలం రెడ్డివారిపల్లెలో మల్రెడ్డి తనకున్న అర ఎకరం భూమిలో టమోటా సాగు చేశాడు. మొక్కలు పొడవుగా పెరిగి బాటసారులను ఆకర్షిస్తున్నాయి. పంటకు దిష్టి తగులుతుందని రైతు భయపడ్డాడు. అందుకే తన పొలానికి నాలుగు వైపులా హీరోయిన్లు తమన్నా, రాశీఖన్నా హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టాడు.  అలాగే కురబలకోట మండలం దాడంవారిపల్లెకు చెందిన మరో రైతు లీలమ్మ కూడా తాను వేసిన మర్రిచెట్టు, టమాటా పంటల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పలువురు కథానాయికల పోస్టర్లను ఏర్పాటు చేసింది.

  Last Updated: 14 Oct 2022, 05:02 PM IST