Ramcharan : హీరో రామ్‌ చరణ్‌కు ‘గౌరవ డాక్టరేట్‌’ ప్రదానం

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 04:57 PM IST

Ramcharan: RRRమూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లోని వేల్స్ విశ్వవిద్యాలయం(University of Wales) గౌరవ డాక్టరేట్‌(Honorary Doctorate) ప్రధానం చేసింది. రామ్‌చరణ్‌కు ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్​కు గౌరవ డాక్టరేట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. డాక్టరేట్ అందుకోనుండటంతో చెర్రీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా, కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు రామ్‌చరణ్‌ డాక్టరేట్‌ అందుకోవడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు నటుడికి అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్‌కు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించడంపై పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.’చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతడు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతడు మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Purandeswari : ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి పురంధేశ్వరి లేఖ..

అంతకముందు ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి రామ్ చరణ్ చెన్నై చేరుకున్నారు. చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన, కూతురు క్లీంకార కూడా చెన్నైకి వెళ్లారు. ఎయిర్ పోర్టు వద్ద చరణ్ కు ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం చెర్రీ(Ram Charan) శంకర్ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్’ మూవీతో పాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంలోని ఓ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు