Vatsala : ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు.. మన ఇండియా “వత్సల”

ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు ? ""!! మధ్యప్రదేశ్ లోని పన్నా పులుల అభయారణ్యంలో ఇది ఉంది.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 08:00 PM IST

ప్రపంచంలో అత్యంత వృద్ధ ఏనుగు ? “”!! మధ్యప్రదేశ్ లోని పన్నా పులుల అభయారణ్యంలో ఇది ఉంది. ప్రస్తుతం వత్సల వయసు 105 ఏళ్ళు. ఇంతకుముందు ఇండియాలోని కేరళలోనే “చెంగాళ్లూరు దాక్షాయిని” అనే ఏనుగు అత్యధికంగా 89 ఏళ్ళు జీవించింది. ఆ రికార్డును వత్సల బద్దలు కొట్టింది. ఈ ఏనుగు యవ్వనంలో ఉండగా.. పులులపై అటవీ అధికారులు పర్యవేక్షణ చేసేందుకు ఉపయోగపడింది. వత్సల వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే 105 ఏళ్ళ ఈ ఏనుగు చైన్లలో కట్టేసి ఉండటంపై పలువురు నెటిజన్స్ పెదవి విరిచారు. “దానికి ఇంకా సంకెళ్లు ఎందుకు? తీసేయండి” అని కొందరు కామెంట్ చేశారు. స్వేచ్ఛగా దాన్ని జీవించనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

బాబీ కట్ హెయిర్ స్టయిల్ తో ఏనుగు..

తమిళనాడులోని మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయంలో సెంగమలం అనే ఏనుగు ఆకట్టుకుంటోంది. దానికి బాబీ కట్ హెయిర్ స్టయిల్ ఉంది. దీని హెయిర్‌ను ఎండకాలంలో రోజుకు మూడు సార్లు, ఇతర సీజన్లలో రోజుకు ఒకసారి కడుగుతుంటారు. ఈ ఆలయానికి వచ్చే వారంతా ఏనుగుతో ఫోటో దిగుతుంటారు.