Income Tax: 2023లో ఆదాయపు పన్నును ఇలా ఆదా చేసుకోండి.. మీ ప్లాన్ రెడీ చేసుకోండి

ప్రతి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను చెల్లిస్తారు. వ్యక్తులు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రేటు వారి ఆదాయాలు, ఇతర వనరుల నుంచి సంపాదించిన లాభాలపై ఆధారపడి నిర్ణయమవుతుంది.

  • Written By:
  • Publish Date - January 8, 2023 / 03:56 PM IST

Income Tax Planning: ప్రతి పన్ను చెల్లింపుదారు ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను చెల్లిస్తారు. వ్యక్తులు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రేటు వారి ఆదాయాలు, ఇతర వనరుల నుంచి సంపాదించిన లాభాలపై ఆధారపడి నిర్ణయమవుతుంది. ఇది ఒక్కో వ్యక్తికి ఒక్కో స్థాయిలో ఉంటుంది. ఇక ఇదే పద్ధతిలో వ్యక్తులు, సీనియర్ సిటిజన్‌లు, కార్పొరేట్‌లకు కూడా పన్ను రేట్లు భిన్నంగా ఉంటాయి. జీతం పొందే వ్యక్తులు తమ పన్నులను చెల్లించి
నిర్ణీత వ్యవధిలో ITRని ఫైల్ చేస్తున్నందున కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. భారత ప్రభుత్వం మీ పన్నులపై ఆదా చేసేందుకు క్లెయిమ్ చేయగల నిర్దిష్ట పెట్టుబడి విధానాలపై పన్ను మినహాయింపుల రూపంలో ప్రయోజనాలను అందిస్తుంది.  అంతేకాకుండా, మీరు సెక్షన్ 80, 80CC & 80CCD కింద రూ. 1.5 లక్షల వరకు కింది విభాగాలలో పన్నుల మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)

ఇది చాలా బ్యాంకులు, పోస్టాఫీసులలో 7.10 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల పాటు పొందగలిగే పన్ను ఆదా పథకం. ఇది ట్యాక్స్ ఫ్రీ స్కీం. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది.

* ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)

EPF ద్వారా కూడా మీరు పన్నులను ఆదా చేసుకోవచ్చు.  EPF స్కీమ్‌కి చెల్లించే జీతంలో 12 శాతం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల పరిమితిగా పరిగణిస్తారు.

* ఫిక్స్‌డ్ డిపాజిట్

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. వీటి ద్వారా పన్ను చెల్లింపుదారులు భారతీయ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందొచ్చు. పన్ను చెల్లింపుదారులు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపును పొందొచ్చు.

* యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్స్)

వీటి ద్వారా కూడా మీరు పన్నులను ఆదా చేసుకోవచ్చు.  యులిప్‌లు దీర్ఘకాలిక పెట్టుబడి ఉత్పత్తులు. ఇవి పన్ను చెల్లింపుదారులకు ఈక్విటీ ఫండ్‌లు, డెట్ ఫండ్‌లు లేదా రెండింటినీ ఎంచుకోవడానికి అనుమతిస్తాయి.  యులిప్‌లు మీ ఆర్థిక లక్ష్యాలతో సమకాలీ కరించబడిన నిధుల మధ్య మారడానికి సౌలభ్యాన్ని అందిస్తాయి.  ULIPలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్లు 80C, 10(10D) కింద పన్నులను ఆదా చేసుకోవచ్చు.