Rs 2 Charge On Order : ప్రతి ఆర్డర్ పై రూ.2 ఛార్జీ.. జొమాటో నిర్ణయానికి కారణమేంటి ?

Rs 2 Charge On Order :  ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్  జొమాటో ఇప్పుడు ప్రతి ఆర్డర్‌కు రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది..

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 10:56 AM IST

Rs 2 Charge On Order :  ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్  జొమాటో ఇప్పుడు ప్రతి ఆర్డర్‌కు రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది..

“ప్లాట్‌ఫామ్ ఫీజు”గా ఈ 2 రూపాయలను తీసుకుంటోంది.. 

రూ.2 ఛార్జీ విధించిన పాప్ అప్ లో ఒక మెసేజ్ ఉంటోంది.. 

“జొమాటోను కొనసాగించడానికి  2 రూపాయల చార్జీని చెల్లించండి” అని  ఆ  మెసేజ్ లో స్పష్టంగా ఉంది.. 

ఈ చార్జీని అన్ని రకాల ఆర్డర్‌లపై వసూలు చేస్తున్నారు. 

ఆర్డర్ రూ. 200  అయినా..రూ. 800 అయినా.. ఒక్కో ఆర్డర్‌కు “ప్లాట్‌ఫామ్ ఫీజు”గా రూ. 2 వసూలు చేస్తున్నారు. 

Also read : Billionaire Businessman-Labour Grandson : వేల కోట్ల అధిపతి మనవడు లేబర్ గా మారాడు.. ఎందుకు ?

వాస్తవానికి ఈ ఏడాది  ఏప్రిల్‌లోనే Swiggy ఇలాంటి చార్జీని వసూలు చేయడం మొదలుపెట్టింది. ఫుడ్ డెలివరీ కాస్ట్ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో స్విగ్గీ చెప్పింది. తాజాగా జొమాటో కూడా అదే బాట పట్టింది. డెలివరీ కాస్ట్ ను కవర్ చేసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో జొమాటో కూడా ఇలా 2 రూపాయల “ప్లాట్‌ఫామ్ ఫీజు”ను(Rs 2 Charge On Order) వసూలు చేయడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ రెండు రూపాయలతో పాటు  Zomato, Swiggy సంస్థలు ప్రతి ఆర్డర్ విలువపై హోటల్స్,  రెస్టారెంట్ ల నుంచి 22 నుంచి 28 శాతం మేర  కమీషన్ కూడా తీసుకుంటాయి.

Also read : Affordable Electric Bicycles : 16వేలకే ఎన్నో ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్‌ !