Ayodhya Ram Ornaments : అయోధ్య రామయ్య ఆభరణాల జాబితా ఇదీ..

Ayodhya Ram Ornaments : అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడి దైవిక ఆభరణాలు, ప్రత్యేక వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 12:02 PM IST

Ayodhya Ram Ornaments : అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడి దైవిక ఆభరణాలు, ప్రత్యేక వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆభరణాలను లక్నోలోని ‘శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ’కు చెందిన ‘హర్షహైమల్ శ్యామ్‌లాల్ జ్యువెలర్స్’ తయారు చేసింది. ఈవిషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వెల్లడించింది. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత్‌మానస్‌, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాల ప్రకారం శ్రీరాముడు అలనాడు ధరించిన దివ్య ఆభరణాలపై అధ్యయనం చేసిన తర్వాత వీటిని తయారు చేయించామన్నారు. పసుపు ధోతీ, ఎరుపు రంగు పతాక/అంగవస్త్రంతో రామ్ లల్లాను అలంకరించారు. ఈ అంగవస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జరీ, దారాలతో తయారుచేశారు. ఈ దుస్తులపై శంఖం, పద్మం, చక్రం, మయూర్ వంటి వైష్ణవ చిహ్నాలను ముద్రించారు. ఈ వస్త్రాలను ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి తయారు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయమాల, భూబంధ్

రామ్ లల్లాను(Ayodhya Ram Ornaments) బంగారంతో తయారు చేసిన విజయమాలను ధరించారు. ఇది కెంపులతో పొదిగి ఉంది. దీన్ని విజయానికి చిహ్నంగా ధరిస్తారు. సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం కూడా ఇందులో ముద్రించి ఉన్నాయి. బాల రాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలను బంగారం, ఎంతో విలువైన రాళ్లతో తయారు చేశారు.

కంగన్, ముద్రిక, ఛడ 

రత్నాలు పొదిగిన గాజులను రామ్ లల్లా రెండు చేతులకు తొడిగారు. రత్నాలతో అలంకరించిన ఉంగరాలు,  రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు  కూడా విగ్రహమూర్తిలో ఉన్నాయి. బాల రాముడి పాదాలు, బొటనవేళ్లకు ఉన్న ఆభరణాలను బంగారం, వజ్రాలు, కెంపులతో తయారుచేశారు.

Also Read: BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?

కంచి

బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగ పేరు కంచి. దీన్ని కూడా బంగారంతో తయారు చేశారు. వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో ఈ నగను అలంకరించారు. స్వచ్ఛతకు ప్రతీకగా చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు ఈ నగకు వేలాడుతుంటాయి.

బంగారు ధనుస్సు, బంగారు గొడుగు 

శ్రీరాముడికి బంగారు గొడుగును తలపై అమర్చారు. రామ్‌లల్లా ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలతో  అలంకరించిన బంగారు ధనుస్సు ఉంది. కుడి చేతిలో బంగారు బాణం ఉంది. మెడ చుట్టూ ప్రత్యేక నగల అలంకారం ఉంది. బాల రాముడి నుదుటిపై వజ్రాలు, కెంపులతో తయారు చేసిన తిలకాన్ని అద్దారు. భగవానుడి పాదాల కింద కమలం, దాని కింద బంగారు దండ అమర్చారు. రామ్ లల్లా ఐదేళ్ల పిల్లాడు కాబట్టి వెండితో తయారు చేసిన గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మల బండి, స్పిన్నింగ్ టాప్ వంటి సంప్రదాయ బొమ్మలు విగ్రహం ముందు ఉన్నాయి.

Also Read: 101 KG Gold : రామయ్యకు 101 కిలోల బంగారం.. విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా?