Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

తాజాగా నాసా అంగారక గ్రహ వాతావరణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని సాధించడానికి సిద్ధమయ్యింది. ఇందుకోసం మన అందరి సహాయం కోరుతుంది నాసా.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 10:00 AM IST

తాజాగా నాసా అంగారక గ్రహ వాతావరణానికి సంబంధించిన ఒక రహస్యాన్ని సాధించడానికి సిద్ధమయ్యింది. ఇందుకోసం మన అందరి సహాయం కోరుతుంది నాసా. ఈ క్రమంలోనే క్లౌడ్ స్పాట్టింగ్ ఆన్ మార్స్ అనే ఒక ప్రాజెక్టును నాసా ప్రారంభించింది. ప్రజలు సిటిజన్ సైన్స్ ప్లాట్ఫామ్ అయిన జూనివెర్స్ ద్వారా మార్స్ గ్రహం పై మేఘాలను గుర్తించవచ్చు. కాగా భూ వాతావరణం తో పోల్చుకుంటే మార్స్ వాతావరణం కేవలం ఒక శాతం మాత్రమే దట్టంగా ఉందట. ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అందిన సమాచారం ప్రకారం మార్స్ బై అత్యంత దట్టమైన వాతావరణంతో పాటు భారీగా మేఘాలు ఉండాల్సింది పోయి అలా ఏమీ లేకపోవడంతో సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారట.

అయితే ఇప్పుడు ప్రజలు మేఘాలకు సంబంధించిన సమాచారం ఇస్తే దాని ద్వారా శాస్త్రవేత్తలకు ఈ మిస్టరీ పై ఎక్కువ స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయట. అయితే కోట్ల సంవత్సరాల కిందట మార్స్ పై సరస్సులు అలాగే నదులు ఉండేవట. కాలక్రమేనా అందులో ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘాలుగా అవ్వాలి. అని ఆ నీరు ఎందుకు అలా అవ్వలేదు అన్నది ప్రస్తుతం శాస్త్రవేత్తలకు అర్థం కాని ఒక విషయం. ఒకవేళ మేఘాలుగా మారకపోయినా ఆ నీరు అలాగే ఉన్నాయా అంటే ఆ నీరు కూడా కనిపించడం లేదు. మరి ఆ నీరు ఎక్కడ పోయింది అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.అయితే మన భూగ్రహంపై ఎలాగైతే మేఘాలు ఉన్నాయో అదేవిధంగా మార్స్ పైన కూడా అక్కడక్కడ నీటి ఆవిరి మేఘాలు ఉన్నాయి. అదే సమయంలోనే మార్స్ పై కార్బన్ డై ఆక్సైడ్ మేఘాలు కూడా ఉన్నాయి. వీటినే డ్రై ఐస్ మేఘాలు అని కూడా అంటారు. ఈ డ్రై ఐస్ మేఘాలు మార్స్ చల్లబడినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మరి ఇలాంటి మేఘాలు ఎక్కడ ఉన్నాయి? అవి ఎలా ఏర్పడుతున్నాయి అన్నది తెలుసుకోవాలి అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు.

మార్స్ పై ఈ మేఘాలు 50 నుంచి 80 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడుతున్నాయట. అయితే ప్రజల మేఘాలని గుర్తించేందుకు నాసా ప్రత్యేక ఆల్గారిథమ్స్ ని ఏర్పాటు చేసిందట.. వాటి ద్వారా ప్రజలు మేఘాలను తేలిగ్గా గుర్తించగలరు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే భూమి తర్వాత మనుషులు జీవించేందుకు ఛాన్స్ ఉన్న మరొక గ్రహం మార్స్. అందువల్లే ఆ గ్రహం పై నాసా లోతుగా పరిశోధనలు చేస్తోంది.