Helicopter Cashed:నేపాల్‌లో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. నువాకోట్ జిల్లాలో ఎయిర్ డైనస్టీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదంలో మరణించారు. నలుగురు ప్రయాణికులు ఒక పైలట్ తో సహా.. మొత్తం ఐదుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు దగ్గరలోని అడవిలో కూలిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా కూడా తెలిపింది. నివేదికల ప్రకారం, హెలికాప్టర్ ఖాట్మండు నుండి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద కొండను ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అధికారులు రెస్క్యూ టీమ్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుండి బయలుదేరినట్లు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే చాపర్ తో సంబంధాలు తెగిపోయాయి.
కాగా, కొద్ది రోజుల క్రితమే జూలై 24న త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒక విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయారు. విమానం కెప్టెన్ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. తాజా ఘటనతో నేపాల్ గగనతల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో అనేక గగనతల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.