Kedarnath: కేదార్‌నాథ్‌ కు పోటెత్తిన భక్తులు.. మార్మోగిన శివనామస్మరణ!

హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయం శివ నామస్మరణ హోరు మధ్య మంగళవారం తెరుచుకుంది.

Published By: HashtagU Telugu Desk
Kedarnath

Kedarnath

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేలమంది భక్తులు తరలిరాగా.. హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయం శివ నామస్మరణ హోరు మధ్య మంగళవారం తెరుచుకుంది. ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా ఉండి.. మంచు కమ్మేసినా భక్తులు (Devotees) కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. వారి ప్రార్థనలు, భజనల మధ్య ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు తెరిచారు. కేదారేశ్వరుడిని దర్శించుకున్న ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ.. ప్రధాని మోదీ (PM Modi) పేరిట తొలి పూజ నిర్వహించారు. ఆలయాన్ని తెరిచే సమయంలో హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు.

మంచు కమ్మేసినా భక్తులు కేదార్నాథ్ (Kedarnath) చేరుకున్నారు. వారి ప్రార్ధనలు, భజనల మధ్య ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు తెరిచారు. కేదారేశ్వరుడిని దర్శించుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. ప్రధాని మోదీ పేరిట తొలి పూజ నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలయాన్ని చేరుకోవడం సవాలుగా మారిందని ధామీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారి ప్రయాణం సులువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్‌ఘటిలో ఈ ఆలయం ఉంది. కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది. ఆది గురు శంకరాచార్య ఈ ఆలయాన్ని (Temple) పునరుద్ధరించారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు. రాళ్లు, దేవదారు చెక్కపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి. ఎంతో ప్రాచీన, చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం కావడంతో దేశ నలుములాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

Also Read: Mahesh Babu: సమ్మర్ వెకేషన్ లో సూపర్ స్టార్.. “SSMB 28” కి మరో బ్రేక్!

  Last Updated: 26 Apr 2023, 12:48 PM IST