భారీ వర్షాలు పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. వరద ధాటికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 343 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. దాదాపు 3కోట్ల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. దీంతో ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం…సింధ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 306 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ లో 234 మంది మరణించగా…ఖైబర్ పంఖ్తుంఖ్వాలో 185, పంజాబ్ ప్రావిన్స్ లో 165 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్ లో ప్రతి ఏటా ఆగస్టులో సాధారణ వర్షపాతం 48 మిల్లీ మీటర్లు నమోదు అవుతుంది. కానీ ఈ ఏడాది 241శాతం అధిక వర్షపాతం నమోదు అయ్యింది. సింధు, బలూచిస్తాన్ లో 784శాతం, 496శాతం అధిక వర్షపాతం నమోదు అయ్యింది. అసాధారణ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణం అయ్యాయని పాక్ వాతావరణ శాఖ తెలిపింది. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ…సహాయక చర్యలు చేపడుతున్నట్లు అక్కడి మంది షెర్రీ రెహ్మాన్ తెలిపారు. 2010 నాటి వరదలతో పోల్చితే…దేశం ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. 3కోట్ల మంది ప్రజలు నిరాశ్రుయులయ్యారు. సహాయక చర్యలకు ఎడతెరిపి లేని వర్షాలు అడ్డంకిగా మారాయి. సింధ్ ప్రావిన్స్ లోని ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు 10లక్షల టెంట్లు అవసరం అయినట్లు ఆమె తెలిపారు.